శీను చిత్రం కోసం మణిశర్మ స్వరపరచిన ఒక ప్రేమగీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : శీను (1999)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : హరిహరన్, సుజాత
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే

ఇదివరకు తెలియంది యీ అనుభవం
ఎద మేలుకొలిపింది యీ పరిచయం
ఎద మేలుకొలిపింది యీ పరిచయం
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ...ప్రేమ
మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ...ప్రేమ
నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ...ప్రేమ
మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ...ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు యిల చేరగా తెర తీసింది ఆమని
ఆకాశ దీపాలు యిల చేరగా తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో…
ఇది ప్రియగీతమో మధు జలపాతమో…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ...వేళ
ఈనాడు యీ దేవితో మనసు తెలిపెను చాల..చాల
కాలాలు వొకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
కాలాలు వొకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో….
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది యీ అనుభవం
ఎద మేలుకొలిపింది యీ పరిచయం
ఎద మేలుకొలిపింది యీ పరిచయం
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
1 comments:
నిజమే..ఒక్కోసారి మనసుకి దగ్గిరైన వాళ్ళ ద్వారానే జీవితం లోని మాధుర్యం అర్ధమౌతుంది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.