గుండమ్మ కథ చిత్రం కోసం పింగళి గారు రచించిన ఒక మధురగీతాన్ని నేడు తలచుకుందాం ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంత హాయీ...
ఎంత హాయీ..
ఆ ఆ ఆ ఆ..
ఎంత హాయీ..
ఆ ఆ ఆ ఆ.......
చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, సుశీల
ఎంత హాయీ...
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి
ఆ ఆ ఆ ఆ..
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగ మత్తుమందు చల్లగా
ఆ..చందమామ చల్లగ పన్నీటిజల్లు చల్లగా
ఎంత హాయీ..
ఎంత హాయి ఈ రేయి
ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ
ఆ ఆ ఆ ఆ..
ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఆ ఆ ఆ..
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
ఆ..విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా
ఎంత హాయీ..
ఎంత హాయి ఈ రేయి
ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ
ఆ ఆ ఆ ఆ.......
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధురభావ లాహిరిలో మనము తూలిపోవగా
ఆ..మధురభావ లహరిలో మనము తేలిపోవగా
ఎంత హాయీ..
ఎంత హాయి ఈ రేయి
ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ
ఎంత హాయీ..ఈ రేయి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.