సోమవారం, మే 25, 2015

అపుడో ఇపుడో ఎపుడో...

బొమ్మరిల్లు చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఒక చక్కని ప్రేమ గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బొమ్మరిల్లు (2006)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : కులశేఖర్/ అనంత శ్రీరామ్
గానం : సిద్ధార్థ్

పనినిసస.. నిసస నిసస నిసస
గరిగమపమగరి సనిసరిప
గమపనిని... పనిని పనిని పనిని
మమమమరిరిరిరినినినినిద
గరిగమగ నిసరిగరి సనిసని
సనిసగగరిపమ మగగప గమపనిస...
నిస గరిస నిస నినిప
నిస గరిస పమపమ గరిస..

అపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమనుకున్న నా మనసందే నువ్వే నేనని

అపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరీ...

తీపి కన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే
వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే
నువ్వు వెళ్లే దారని అంటానే
నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

అపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరీ

పనినిసస.. నిసస
పనినిసస.. నిసస
పనినిసస గరిసనిప
గమపనిని... పనిని
గమపనిని... పనిని
గమపనిని సనిదపమ
గరిగమగ నిసరిగరి సనిస...

నన్ను నేనే చాలా తిట్టుకుంటా..
నీతో సూటిగా ఈ మాటాలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా..
ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే

అపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరీ

పనినిసస.. నిసస
పనినిసస.. నిసస
పనినిసస గరిసనిప
గమపనిని... పనిని
గమపనిని... పనిని
గమపనిని సనిదపమ
గరిగమగ నిసరిగరి సనిస...
సనిస... సనిస... సనిస..

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.