చెట్టుకింద ప్లీడర్ చిత్రమ్ కోసం ఇళయరాజా స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
జిగిజిగిజిగిజా జాగేల వనజా
లాలి లాలి ప్రేమ రాణీ
జిగిజిగిజిగిజా…
స్నానాలాడే మోహనాంగి
జిగిజిగిజిగిజా…
చిత్రం : చెట్టు కింద ప్లీడర్ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర
జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
లాలి లాలి ప్రేమ రాణీ
అనురాగంలోనే సాగిపోని
మేనా లోనా చేరుకోని
సురభోగాలన్ని అందుకోని
పెదవి పెదవి కలవాలి
యదలో మధువే కొసరాలి
బ్రతుకే మమతై నిలవాలి
మురళీ స్వరమై పలకాలి
ప్రేయసి పలుకే మాణిక్యవీణ
ప్రేమావేశంలోనా
కౌగిలి విలువే వజ్రాల హారం
మోహావేశంలోనా
రావే రావే రసమందారమా
జిగిజిగిజిగిజా…
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
జిగిజిగి జిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
నాదేలే మమతల మణిహారం
నీదేలే వలపుల వైభోగం
స్నానాలాడే మోహనాంగి
ఇక సొంతం కావే శోభనాంగి
దూరాలన్ని తీరిపోని
రసతీరాలేవో చేరుకోని
తనువు తనువు కలిసాకా
వగలే ఒలికే శశిరేఖా
ఎగసే కెరటం యదలోనా
సరసం విరిసే సమయానా
ముందే నిలిచే ముత్యాలశాల
పువ్వే నవ్వే వేళా
రమ్మని పిలిచే రత్నాల మేడా
సంధ్యారాగంలోనా
వలపే పలికే ఒక ఆలాపన
జిగిజిగిజిగిజా…
జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.