శుక్రవారం, ఫిబ్రవరి 03, 2017

ఆలనగా పాలనగా...

కుంకుమ తిలకం చిత్రం కోసం ఏసుదాస్ గారు గానం చేసిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కుంకుమ తిలకం (1983)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : కె.జె.ఏసుదాస్
 
ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా

నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్ని
నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్ని
అరఘడియయినా నీ ఎడబాటు
వెన్నెలకూడ చీకటి నాకు

లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా

మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం
మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం
నేనంటే నీ మంగళసూత్రం
నువ్వంటే నా ఆరోప్రాణం
 
లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
 

2 comments:

nice song ee songlo yesudas gari voice diffrentga chala bagundi

Gentle voice of KJY is really soothing in this song - Thank You for sharing!!!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.