ఆదివారం, ఫిబ్రవరి 05, 2017

సిన్ని సిన్ని కోరికలడగ...

స్వయంకృషి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వయంకృషి (1987)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సిరివెన్నెల
గానం : జానకి

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
 
సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా


ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక శెలవికా శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక శెలవికా శరణేలే

ఎవరికి తెలియని కథలివిలే
ఎవరికి తెలియని కథలివిలే
ఎవరో చెప్పగా ఇక ఏలే

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా


నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలూ..ఊఊఊ..
నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు

సందిటనేసిన చెలువములే
సందిటనేసిన చెలువములే
సుందరమూర్తికి చేలములు 
ఆ ఆ ఆ ఆ

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా

కళల ఒరుపులే కస్తురిగా
వలపు వందనపు తిలకాలూ..ఊఊ..
వలపు వందనపు తిలకాలు

అంకము జేరిన పొంకాలే
అంకము జేరిన పొంకాలే
శ్రీవేంకటపతికికా వేడుకలు.. 
ఉహు.. ఉహూ...  ఉ

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా 

 

2 comments:

Another Annamacharya-keertana-like-song from Sirivennela garu. Thanks for posting!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.