శనివారం, ఫిబ్రవరి 04, 2017

చినుకు చినుకుగా...

ముక్కుపుడక చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముక్కుపుడక (1983)
సంగీతం : జె.వి. రాఘవులు
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ

చినుకు చినుకుగా... చిగురు మెత్తగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా


అల్లన ఉదయించే ప్రతి కిరణం
చల్లగ చలియించే నీ చరణం
నింగిని విహరించే ప్రతి మేఘం
పొంగిన ప్రేమకు సందేశం

ఊహలే ఊసులై.. ఆశలే బాసలై
హే హే..ఊహలే ఊసులై.. ఆశలే బాసలై
మధువులు చిలుకగా మధురిమలొలకగా
ప్రణయవేద మంత్రమేదో పలుకగా

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
ఆహాహా.. గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ
ఆ ఆ చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా

వలచిన జంటను కనగానే
చిలకలకే కన్ను చెదిరిందీ
కవితలకందని పలుకులలో
కమ్మని దీవెన మురిసిందీ

కడలియే గగనమై.. గగనమే కడలియై
ఆహాహా కడలియే గగనమై గగనమే కడలియై
సహచరి నడకల స్వరఝరి తొణకగ
సరసరమ్య దివ్యసీమ నిలుపగ

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా


 

1 comments:

Starting of this song reminds me another Rajendra Prasad's song - Chukkalu temmanna - from April 1 Vidudala. Thanks for posting!!!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.