బుధవారం, ఫిబ్రవరి 01, 2017

మనసు ఒక మందారం...

ప్రేమ తరంగాలు చిత్రం కోసం బాలు గానం చేసిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ తరంగాలు (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

ఉ..హు..ఆ.. ఆ.. ఆ..
లా..లాలాలా..
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం

ఈ తోటలో..  ఏ తేటిదో
తొలిపాటగా వినిపించెను
ఎద కదిలించెను
ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా?
వికసింతువా వసంతమా?

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

ఈ చీకటి.. నా లోకము
నీ రాకతో మారాలిరా
కథ మారాలిరా
ఆ మార్పులో నా తూర్పువై
ఈ మాపు నే వెలిగింతువా నేస్తమా?
వికసింతువా వసంతమా?

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

ఆహా..హా.. ఆ.. ఆ.. ఉమ్మ్..ఉమ్మ్ 

 

2 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.