మల్లీశ్వరి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : ఘంటసాల, భానుమతి
ఓ....ఓ...
హేయ్! పరుగులు తీయాలి ఓ
గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్! పరుగులు తీయాలి ఓ
గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున
ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
ఓ.....హోరుగాలి కారుమబ్బులు
హోరుగాలి కారుమబ్బులు...
ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు..
ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ....
గలగల గలగల కొమ్ముల గజ్జెలు..
ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ....
వాగులుదాటి.. వంకలు దాటి..
ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
ఆ......ఆ.....ఆ....... అవిగో అవిగో..
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు..
అవిగో అవిగో.. అవిగో అవిగో
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు...
అవిగో అవిగో అవిగో
ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో...
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో..
ఆ...ఆ......ఆ....ఆ....... ఆ...ఆ......ఆ....ఆ..
3 comments:
What a song !!! I am really happy to see this in your blog, Venu Srikanth garu. Thanks for posting !
వేణుశ్రీకాంత్ గారు,
ఒక పాత పాట వెలికి తీయడానికి మిమ్మల్ని కోరదామని ఈ కామెంట్ వ్రాస్తున్నాను. పాట ఏ చిత్రంలోనిదో గుర్తు లేదు 🙁 (బహుశః 1950 దశాబ్దం చివరిలోనో, 1960 దశాబ్దం మొదట్లోనో వచ్చిన సినిమా అని నా అంచనా. ఎందుకంటే 1960 దశాబ్దంలో ఈ పాటని రేడియోలో తరచూ వినిపిస్తుండేవారు). పాట పల్లవి కూడా గుర్తులేదు 🙁. కొన్ని చరణాలు మాత్రం జ్ఞాపకం. అవి ఈ క్రింద ఇస్తున్నాను. చాలా అందమైన పాట.
నేను వెదికాను గానీ ఆన్లైన్లో పట్టుకోలేకపోయాను. మీకు వీలయితే పాటని పట్టుకుని ఇక్కడ పోస్ట్ చెయ్యగలిగితే సంతోషం (ఆడియో మాత్రమే దొరికినా ఫరవాలేదు). థాంక్స్.
కొన్ని చరణాలు :-👇
అద్దంలో నీడ (బొమ్మ???) చూసి అన్నయ్య కదిలాడే
అందాల భరిణెను చూసి అప్పుడేమి అన్నాడే //
మనసులేకమయ్యెనంటూ మాటలు కలిపాడే
ఆ వెంటనే తల్లికి నచ్చజెప్పినాడే
ఆ చక్కని చుక్కను పెండ్లి యాడినాడే //
నాక్కూడా తెలియలేదు నరసింహరావు గారు. వెతికి చూస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.