బుధవారం, ఫిబ్రవరి 15, 2017

తకధిమి తకధిమితోం...

ధర్మాత్ముడు చిత్రం కోసం ఏసుదాసు గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధర్మాత్ముడు (1983)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : ఏసుదాస్

తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

రూపం చూస్తే దీపమని లోకం తెలియని పాపవని
ఎట్టా నీతో చెప్పేది చెప్పక ఎట్టా దాచేది
ఏమి చిత్రమే ఇదీ చందమామా
ఎంత చోద్యమే ఇదీ చందమామా


తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

చేరే తీరం ఏదైనా పయనించేదీ ఒక పడవ
ఎవరికి ఎవరో నిన్నటికి ఏమౌతామో రేపటికి
బదులు పలకవే నువ్వు చందమామా
పలకలేవులే నువ్వు చందమామా
 
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా 


1 comments:

Thank You for posting such a nice song! మైలవరపు గోపి గారు చాలా తక్కువ పాటలే రాసినా చాలా చక్కటి పాటలు రాశారు. గోపిగారు రాసిన ఇంకో మంచి పాట కార్తీకదీపం లో 'నీ కౌగిలిలో తలదాచి'.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.