శనివారం, ఫిబ్రవరి 11, 2017

ఇంతలో ఎన్నెన్ని వింతలో...

ప్రామిస్ డే సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ చక్కని ప్రేమ పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కార్తికేయ (2014)
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : కృష్ణ చైతన్య
గానం : నరేష్ అయ్యర్

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసానూ
ఆయువో నువు ఆశవో
నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓగేయమో నువు ఎవరివో హలా

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
 
చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే
నీ ప్రేమే పంచావు ధన్యం అనిపిస్తుందీ
పడిపోయానే నే నీకికా నువు ఎవరైతే అరె ఏంటికా
ఉందో లేదో తీరికా ఈ రేయి ఆగాలికా

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో


పైకెంతో అణుకువగా సౌమ్యంగా ఉంటుందీ
తనతోనే తానుంటే మతిపోయేలా ఉందీ
రాసుందో లేదో ముందుగా
నువు కలిసావో ఇక పండుగా
ఉన్నావే నువె నిండుగా నా కలలకే రంగుగా

ఒో ...హో ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసానూ
ఆయువో నువు ఆశవో
నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓగేయమో నువు ఎవరివో హలా

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో


గానం : చిన్మయి

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను

మాయవో నువు ఆశవో
నువు వీడనీ తుది శ్వాసవో
రాయని ఓ గేయమో
నువు ఎవరివో హలా

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో


పరిచయమే పరవశమై 
నిన్ను నాతో కలిపింది
వ్రాసిందే జరిగింది అయినా కలలా ఉంది
ఒకటయ్యాక మీలో ఇక
నీతో ఉంటామరి నేనిక
లేనే లేదిక తీరిక
ఇది మనసులో కలయిక

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో 


1 comments:

ఏంటో ఏం పాటలో ఏం మాటలో 👎

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.