అంజనా సౌమ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంజనా సౌమ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, డిసెంబర్ 15, 2018

పుట్టలోన ఏలుపెడితే...

భైరవ గీత చిత్రంకోసం తెలుగులో పిల్లల పాటలను కలుపుతూ సిరాశ్రీ సరదాగా రాసిన ఓ గమ్మత్తైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భైరవ గీత (2018)
సంగీతం : రవిశంకర్
సాహిత్యం : సిరాశ్రీ
గానం : అసిత్ త్రిపాఠి, స్వీకార్, అంజనా సౌమ్య

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా
పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

ఈరిఈరీ గుమ్మడి పండు ఈడిపేరమ్మా
ఇంతకన్నా నాకు ఏదీ పాట రాదమ్మా
హ ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం
రాజు ఎక్కె గుర్రం అది రంగుల గుర్రం
ఒప్పులకుప్పా వయ్యారి భామా
చుక్ చుక్ రైలొత్తందమ్మా

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

గుడి గుడి గుంజమంటూ
కాలికి గజ్జె ఇయ్యాలా పాడెయ్ నా
ఓయ్ దాగుడు మూత అంటూ
ఓ చెమ్మ చెక్కాడైనా పాడెయ్ నా
ఏయ్ కోతిబావ పెళ్ళి చేసేద్దామా మళ్ళీ
ఉడతా ఉడతా ఊచ్ సిందేద్దామా తుళ్ళీ
అరె తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో మేళాలోయ్

ఓ సందమామ రావే జాబిల్లీ రావే
అంటూనే పాడేయ్ నా
అ ఉప్పు కప్పురమ్ము పద్యాలు
పాటకట్టేసి పాడేయ్ నా
ఏయ్ సేత ఎన్నముద్ద సెంగల్వ పూదండ
నీ నవ్వులోన ఉంది తెల్లాని పాలకుండ
అరె ఉడతబోయి ఎలక వచ్చే
ఎలకా బోయీ పిల్లి వచ్చే

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

ఈరిఈరీ గుమ్మడి పండు ఈడిపేరమ్మా
ఇంతకన్నా నాకు ఏదీ పాట రాదమ్మా
హెయ్ ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం
రాజు ఎక్కె గుర్రం అది రంగుల గుర్రం
ఒప్పులకుప్పా వయ్యారి భామా
చుక్ చుక్ రైలొత్తాందమ్మా

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా


శుక్రవారం, ఆగస్టు 31, 2018

వారూ వీరూ అంతా...

ఈ సినిమా స్టిల్స్ చూసిన వారెవరైనా "నాగ్ ఈజ్ ఏజింగ్ లైక్ ఫైన్ వైన్" అని అనుకోకుండా ఉండలేరేమో. నాగ్ అండ్ నానీ కాంబినేషన్ లో త్వరలో విడుదలవనున్న "దేవ్ దాస్" చిత్రం లోని ఒక వింటేజ్ ఫీల్ తెప్పించే పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవ్ దాస్ (2018)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య

వారూ వీరూ అంతా చూస్తూ ఉన్నా
ఊరూ పేరూ అడిగెయ్యాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దాం అనుకున్నా
ఏ మాటా పైకి రాకా
మనసేమో ఊరుకోకా
ఐనా ఈనాటి దాకా
అస్సలు అలవాటు లేకా
ఏదేదో అయిపోతున్నా

పడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఏం లోటో ఏమొ ఖర్మా

వారూ వీరూ అంతా చూస్తూ ఉన్నా
ఊరూ పేరూ అడిగెయ్యాలనుకున్నా

జాలైనా కలగలేదా
కాస్తైనా కరగరాదా
నీ ముందే తిరుగుతున్నా
గాలైనా వెంటపడినా
వీలైతే తరుముతున్నా
పోనీలే ఊరుకున్నా
సైగలెన్నో చేసినా
తెలియలేదా సూచనా
ఇంతకీ నీ యాతనా
ఎందుకంటే తెలుసునా
ఇదీ అనేది అంతు తేలునా

పడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఏం లోటో ఏమొ ఖర్మా

ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పురవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్భుతంలో
ఊయలూపినావు హాయి కైపులో
అష్టదిక్కులా ఇలా వలేసి వుంచినావే
వచ్చి వాలవే వయ్యారి హంసరో
ఇన్ని చిక్కులా ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్ళకే నన్నింత హింసలో
తమాషా తగాదా తెగేదారి చూపవేమి బాలా..

పడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఏం లోటో ఏమొ ఖర్మా


శనివారం, డిసెంబర్ 17, 2016

కోపాల గోపాల అలకేలరా...

అ.ఆ. సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అ.ఆ..(2016)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : అభయ్ జోద్పుర్కర్, అంజనా సౌమ్య, సాయిశివాని, చిత్ర

హే..రామ్ములగా బుగ్గలవాడా
బురుజుగోడ నిబ్బరాలా కండలవాడా
రాజాంపేటా లాకుల కాడా
కలుసుకుంట కాసులపేరు పట్టకరారా
అల్లాబక్షు అత్తరు దెచ్చా
కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చా
రంగమెల్లే రైలుబండి రయ్యిమంది
పెట్టేబేడా పట్టుకొచ్చా

నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం
వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం
మౌనంగా… ధ్యానంలో ఉందీ.. మాగాణం..

చిట్టి వడ్రంగి పిట్టల టిక్కూ టిక్కూ
కొమ్మ రెమ్మల్లో మైనాల కుక్కూ కుక్కూ
ఇదిపల్లెకి తెలిసిన మెలొడీయా...
యా.. య్యా.. యా.. య్యా..
యా.. య్యా.. యా.. య్యా..

యయా.. ముగ్గులూ ముంగిళ్ళూ
యయా.. ప్రేమలూ నట్టిళ్ళూ
యయా.. చూడగా చాలేనా రెండే కళ్ళు
యయా.. పువ్వులూ పుప్పొళ్ళూ
యయా.. పంటలూ నూర్పిళ్లూ
యయా.. పండగలు తిరణాళ్లూ
ఈ పచ్చిగాలి జోలలూ నచ్చనోళ్లు లేరట

కళ్ళాపి చల్లాలి రాయేందె రంగమ్మా
కవ్వాలు తిప్పాలి కానియ్యె గంగమ్మా
కావిళ్లు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మా
పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా
యాయా..యాయా..యాయా..యాయా..
యాయా..యాయా..యాయా..యాయా..

కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా
కోపాల గోపాల అలకేలరా
చీకటి వేళకి నీ పంచన
చేరని మనసిది శమించునా
వెన్నని మన్నని దొసములెన్నను
చెల్లాట చాలించరా
అల్లరి చేష్టల దండించనా
అక్కున జేరిచి లాలించనా
నెమ్మది చెదిరిన అమ్మను
చూడగ బిరాన రారా దొరా
కోపాల గోపాల కోపాల గోపాల
కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా

సోమవారం, అక్టోబర్ 17, 2016

నాయుడోళ్ళింటికాడ...

బ్రహ్మోత్సవం చిత్రంలోని ఒక చక్కని జానపదాన్ని ఈ రోజుతలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బ్రహ్మోత్సవం
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అంజనా సౌమ్య, రమ్య బెహరా

నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మ చెట్టు కాడ
నాయుడెమన్నడె పిల్లా
అబ్బ ఎంత వింతగున్నావే పిల్లా
నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మ చెట్టు కాడ
నానుకొళ్ళిచ్చాడే నాయుడు
అబ్బ గుండె ఝల్లుమన్నాదే పిన్నీ

కరణం గారింటికాడ
కారుమునగ చెట్టు కాడ
కాముడేమన్నాడే పిల్లా
ఓహో..కాముడేమన్నాడే పిల్లా
కరణం గారింటికాడ
కారుమునగ చెట్టు కాడ
కాసుల పేరిస్తాన్నాడమ్మా
ఓ కాసుల పేరిస్తాన్నాడమ్మా

మునసబు గారింటికాడ
ముందర దర్వాజు కాడ
ఆతడేమన్నాడే పిల్లా
ఓహో..ఆతడేమన్నాడే పిల్లా
మునసబు గారింటికాడ
ముందర దర్వాజు కాడ
ముక్కుపుడక లిస్తాన్నాడమ్మా
ముక్కుపుడక లిస్తాన్నాడమ్మా

ముంతంత కొప్పు మీద
మూడు చేమంతి పూలు
ఏ రాజు పేట్టాడే పిల్లా
అబ్బ ఎంత చక్కగున్నావే పిల్లా
చేమంతి పువ్వులు చెంగులోన తానేట్టి
కోరి కోరి పిలిచాడే నాయుడు
అబ్బ గుండె దడ దడలాడే పిన్నీ

కాసులపేరేసుకోని కాలువ గట్టెళుతుంటే
కానిపట్టు పట్టాడే నాయుడు
అబ్బ గుండె ఝల్లుమన్నాదే పిన్నీ
మాయమ్మ తమ్ముళ్లు..మాకు మేన మామలు
గుబ్బ గొడుగులవారు..కిర్రు చెప్పులవారు
చేతి కర్రలవారు..వార కన్నులవారు
వయ్యారి నడకవారు
ఏత్రోవనున్నారమ్మా

రవికేసుకో..పమిటేసుకో
పంచాదిలో మంచమేసుకో
వాకిట్లో దీపమెట్టుకో
రాకపోతే కేకెసుకో


గురువారం, జులై 21, 2016

మెల మెల్లగా చిగురించెనే...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం కోసం రమణ గోగుల స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వెంకటాద్రిఎక్స్ ప్రెస్ (2013)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : శ్వేతా మోహన్, అంజనా సౌమ్య

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మరుమల్లెలా వికసించెనే
ఎదలోతులో ఈ కలయికా

పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా
పొగమంచును మీటినా కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే నువ్వేనేనులా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

అనుకోని తీరమైనా నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా
కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
నీలోన నేనుకరిగీ పులకించనా
నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

 

మంగళవారం, ఆగస్టు 12, 2014

వాన చినుకులు...

సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన సినిమా అంటూ ఇటీవల వచ్చిన మల్టీస్టారర్ "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలోని ఈ వాన పాట కూడా చాలా బాగుంటుంది. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
సంగీతం : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : కార్తీక్, అంజనా సౌమ్య

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
 
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
 
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే

 
నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశా
జారు పవిటని గొడుగుగ చేశానోయ్
అరె ఊపిరితో చలి కాశానోయ్
హే ఇంతకన్న ఇవ్వదగ్గ ఎంతదైన ఇక్కడుంటె
తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే
వాన చినుకులు
 
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే

 
సిగ్గులతొ మెరిశా గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిశా ఒళ్ళు హరివిల్లుగ వంచేశా 
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగ వస్తె బిందెలాగ ఉన్నఊహ
పట్టుకున్న హాయికింక లేదు కొలతే

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే 
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే ఎంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.