రాజన్-నాగేంద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజన్-నాగేంద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, అక్టోబర్ 22, 2020

తొలి వలపు తొందరలు...

సొమ్మొకడిది సోకొకడిది చిత్రంలోని ఈ చక్కని పాట తెలియని వారుండరేమో. హ్యూస్టన్ లో స్వరాభిషేకం కండక్ట్ చేసినపుడు స్టేజ్ మీద బాలు గారితో పాడిన శ్రావణ భార్గవి ఈ పాట పాడిన తర్వాత మీకు కోపం రావచ్చేమో కానీ నాకో చిన్న కోరిక ఉంది కోరనా అని అడిగింది. ఆవిడ ఏం కోరిందో దానికి బాలు గారి అల్లరి ఎలా ఉందో. అంతటి గొప్పవారైనా కూడా ఏమాత్రం భేషజం లేకుండా ఈతరం గాయనీగాయకులతో ఎంత సరదాగా చిన్నపిల్లాడిలా ఎలా కలిసిపోతారో ఈ వీడియోలో చూస్తే ముచ్చటేస్తుంది.  
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్.జానకి

తొలి వలపు తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను చలితో నీవు
చేసే అల్లరులు

ఆ..తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు చలితో నేను
చేసే అల్లరులు

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు

పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు
కరగాలి కౌగిళ్ళలో
వలపించే వళ్ళు.. వలచే పరవళ్ళు
కదిలే పొదరిళ్ళలో  
తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు
కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు
బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు.. నేనే పొందాలు
నాకే చెందాలిలే

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను..చలితో నీవు
చేసే అల్లరులు హా...

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు

కురిసే ఈ వాన.. తడిసే నాలోనా
రేపిందిలే తపనా
పలికే పరువాన.. వలపే విరివాన
నీవే ఆలాపనా
వణికే నీ మేన.. సణిగే నా వీణ..
పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు..
సిగలో నేనుంచనా
నీలో రాగాలు.. నాలో రేగాలి
నేనే ఊగాలిలే

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు..చలితో నేను
చేసే అల్లరులు
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు

తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు
తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు
 

శనివారం, అక్టోబర్ 10, 2020

మల్లెలు పూసే.. వెన్నెల కాసే..

ఇంటింటి రామాయణం సినిమా కోసం వేటూరి గారు అద్భుతంగా రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. రాజన్ నాగేంద్రలలో రాజన్ గారు చెప్పే మాటలు. ఇప్పటికీ వారి ముందు పాడాలంటే భయమేస్తుందనే బాలు గారి వినయం ఇతర విశేషాలు వీడియోలో పాట తర్వాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : యస్ పి బాలసుబ్రహ్మణ్యం

మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా..ఆ..హాహా...హా...ఆ....ఆ...

తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవె
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
 కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కా...సే.. ఈ రేయి హాయిగా
 


బుధవారం, జులై 29, 2020

ఎన్నెన్నో జన్మల బంధం...

జాన్ అప్పారావ్ 40 ప్లస్ సినిమా కోసం "ఎన్నెన్నో జన్మల బంధం" పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జాన్ అప్పారావ్ 40 ప్లస్ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
రీమిక్స్ : కిరణ్ వారణాసి
గీతరచయిత : దాశరథి
గానం : హేమచంద్ర, గీతామాధురి

రాజన్-నాగేంద్ర గారు స్వరపరచిన ఈ అందమైన ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : దాశరథి
గానం : బాలు, వాణీ జయరాం

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేళా నిండును చెలిమి
ఓహో హో హో ..నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను
చేరనా. చేరనా.. చేరనా...
 
 
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

విరిసిన కుసుమము నీవై మురిపించేవు
తావిని నేనై నిన్నూ పెనవేసేను
ఓహో హో హో మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి
ఆడనా.. ఆడనా.. ఆడనా...
  
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి
ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ. ఉండనీ.. ఉండనీ..

ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఆఅహాహహహాఅ..ఓహోహోహొహో..
 

ఆదివారం, ఫిబ్రవరి 02, 2020

ఏమో ఏమో ఇది...

రాజన్-నాగేంద్ర గారి స్వరకల్పనలో సినారే గారి రచన ఈ సింపుల్ అండ్ స్వీట్ సాంగ్ మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


 
చిత్రం : అగ్గి పిడుగు (1964)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, జానకి

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హాయ్...
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

కనులలో నీ కనులలో.. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో.. నా కోరికలూగినవీ
ఆహ.. ఆహ... ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినదీ 
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది.. 
గిలిగింతగ తోచినది
 
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహ.. ఒహో.. ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. 

నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు 

మంత్రించివేయకు

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు.. హూ..హుహు.. 


గురువారం, అక్టోబర్ 10, 2019

రంభ హో..హో.. హో..

అప్పుల అప్పారావు చిత్రంలోని ఈ సరదా పేరడీ ని ఈ రోజు తలచుకుందాం. ఇది పాపులర్ హింది సినిమా పాటలకి పారడీ కనుక ఒరిజినల్ సాంగ్స్ ఇక్కడ ఇవ్వడం లేదు. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అప్పుల అప్పారావు (1991)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : సాహితి
గానం : బాలు, శైలజ, మాల్గాడి శుభ,
రాధిక, రమణ, మాధవపెద్ది రమేష్ 

రంభ.. హో..హో.. హో..
రంభ.. హో..హో.. హో..
పందిట్లో.. హో.. హో.. హో..
పంతులో.. హో..హో..హో..
నా నిషా చెయి మిష
రాహువే అడ్డుగా వచ్చిన ఆగక రేగిపో
కేతువే కేకలే వేసినా జంకకా ఊగిపో
రంభ.. హో..హో.. హో..
పందిట్లో.. హో.. హో.. హో..
పంతులో.. హో..హో..హో..

ఆఆ.. కస్సని కిక్కు నషాలమునకెక్కే
ఒళ్ళే యమ కైపెక్కే..
అటు ఛమక్కు భామ
ఇటు చురుక్కు ప్రేమా
ఇరుక్కు పోయా నడుమ
ముద్దిచ్చే మోజే నాకుందిరా అప్పా
కావాలే నాకు నీ కమ్మని దెబ్బ
అనిపిస్తా చూడు నీ నోటితొ అబ్బా
కావాలే నాకు నీ కమ్మని దెబ్బ
అనిపిస్తా చూడు నీ నోటితొ అబ్బా
మంచమే వెయ్యవే పంచలోనె
మన్నులో కొయ్యలే దించుతానే
నీ దమ్మే ఇంట్లో చూపియ్ రో రప్పా
కిమ్మంటే తింటావ్ రో దెబ్బా

హోహో.. నిన్నెక్కడో చూశానే..
నిన్నెప్పుడో కలిశానే
గుర్తే తెచ్చుకోనీ అమ్మాజీ
పాతికేళ్ళ మునుపే తొలిరేయి
పసందుగా జరిగే బ్రహ్మాజీ
ఆనాడున్న పవరే చూపాలండీ తమరే
ఘుమాయించు నువ్వే తమాయించుతానే

ప్రేమా ప్రేమా ప్రేమా
ఖైదీ ఖైదీ ఖైదీ
బుజ్జీ బుజ్జీ బుజ్జీ
ముద్దియ్ ముద్దియ్ ముద్దియ్
కనిపిస్తే కన్నే వేస్తా
కనిపెట్టి కన్నం వేస్తా
రేయంతా చల్లే చిలికి
వెన్నంతా జుర్రుకు తింటా
సొరుగులో సొమ్ములు నీవే లేరా
దుడుకుగా ఇప్పుడే దోచుకు పోరా

అప్పారావ్ రో ఆపలేరో
ఎప్పుడంటే అప్పుడేరో
అప్పారావ్ రో ఆపలేరో
ఎప్పుడంటే అప్పుడేరో
సరి సరి ఉలిపిరి తెరలను తెరుస్తా
సుబ్బులు ఇస్తా తీపులు
ఆలినేను రో నన్ను చూడరో
వెలగని పుట్ట పగలగొట్టరో
అది మరి ఒకటే ఉన్నదే బంగారీ
దానిని ఎవరికి ఇవ్వనూ

సాస్సా సరిగమ పాప్పా
రిరీ రిగమప దాదా
లపాకీ పాపా దాదా దా
చలాకీ సానీదా
నేనంటే ప్రేమేగా
నీవంతా నాకేనా
సర్వ శాస్త్రములు తెలిసిన శాస్త్రీ
ఓ కామశాస్త్రమున నువ్వే మేస్త్రీ
కానీరా కుస్తీ
చిరు నువ్ సుప్రీమే నీ ప్యారీ నేనేనె
నువ్వోస్తే ఈ పూటా నీకిస్తా నాతోట
చిరంజీవివి యముడికి మొగుడివి ఓ
జిలిబిలి పడతుల ఊహల మొగుడివి
నీతోనే దోస్తీ

జుమ్మా జుమ్మా చుమ్మ చుమ్మా
ఓలమ్మో కావమ్మో ఓటేసేదియ్యాలే
బూతుల్లోకొచ్చేయ్యె ఆ ముద్రే గుద్దెయ్యే
బూతంటావ్ ఏందయ్యో గుద్దేది యాడయ్యో
పైటేసుకు తగలడవే నా పరువే నిలబెట్టే
సెగలే గుప్పించేయ్ సుడులే తిప్పించేయ్
తమకం తయ్యా తయ్ యమకం హొయ్యా హొయ్
రాసలీలల్లో రోజంతా మోత మోతా మోతా

జుమ్మా చుమ్మా ఇమ్మా
జుమ్మా జుమ్మ ఓర్నీ జిమ్మా
జుమ్మా చుమ్మా ఇమ్మా
జుమ్మా జుమ్మా ఓర్నీ జిమ్మా

ఓ చెమ్మా చెమ్మా కమ్మే ఒళ్ళాంతా కాక చెమ్మా
మామామా అప్పు మామా నాతో ఆడించు అష్టాచెమ్మ
కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగపండు
కన్నె యీడు కరగపెట్టుకోమ్మా ఓ పోలిసమ్మా

శృంగారంలో చాటు మాటు లేదు
యవ్వారంలో అడ్డు ఆపు లేదు
ఉల్లాసంలో వేళా పాళా లేదు
సల్లాపంలో అలుపు సలుపు లేదు
అవ్వ అవ్వ అవ్వ అవ్వా
సయ్యాటల్లో సిగ్గూ ఎగ్గు లేదు
బులపాటంలో గుట్టు మట్టు లేదు
పేకాటల్లో అంతూ పొంతు లేదు
గిలిగింతల్లో పిలక గిలక లేదు
అవ్వ అవ్వ నువ్వే నా కిలిమంజారో
అవ్వ అవ్వ హాయిస్తా గిలిగింతల్లో
అవ్వ అవ్వ నీహాయే దాచెయమ్మో 
 

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ఎడారిలో కోయిలా...

పంతులమ్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పంతులమ్మ (1977)
సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజన్ - నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఆఆఆఅ...మ్..మ్... ఎడారిలో కోయిలా..
తెల్లారనీ రేయిలా...
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే..

ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన
మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత
విధిరాత చేత నా స్వర్ణ సీత

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట
చెలిలేని పాట... ఒక చేదు పాట

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా  
 

 

శుక్రవారం, ఆగస్టు 09, 2019

వరమహాలక్ష్మీ కరుణించవమ్మా...

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళామణులకు శుభాకాంక్షలు తెలుపుతూ వరలక్ష్మీవ్రతం చిత్రం లోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వరలక్ష్మీ వ్రతం (1971)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : జానకి, లీల, పి.బి.శ్రీనివాస్ బృందం

వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
చరణాలే శరణంటినమ్మా…
పతిదేవు బాసితి వెతలంది రోసితి
నుతియింతు పతినీయవమ్మా
వరమహాలక్ష్మీ వరమీయవమ్మా


మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా

పాలకడలిన పుట్టి శ్రీహరిని చేపట్టి
వైకుంఠలోకాన లక్ష్మివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
సత్వగుణమూర్తివే ఆ… సంపత్స్వరూపివే ఆ…
సత్వగుణమూర్తివే… సంపత్స్వరూపివే…
సర్వసిద్ధివి నీవే సుమ్మా
 
నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా


వాగీశు రాణివై వరవీణపాణివై
బ్రహ్మలోకమ్మున వాణివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా… 

కల్యాణదాయిని కళల స్వరూపిణి
ఇల సకల విద్యలకు తల్లివీవమ్మా

నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా
గిరిరాజ తనయవై పరమేశు తరుణివై
కైలాసలోకాన గౌరివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా… 

శక్తిస్వరూపిణి మాం పాహి మాతా
భక్తజనపాలిని మాం పాహి మాతా
భక్తజనపాలిని మాం పాహి మాతా
సుఖసౌఖ్య సౌభాగ్యదాయివీవమ్మా

నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా
పతినీయవమ్మా…
పతినీయవమ్మా…
పతినీయవమ్మా…


సోమవారం, జూన్ 10, 2019

కలికీ చిలకరా...

నాలుగు స్తంభాలాట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

హె హె హె హె హె
కలికి చిలక రా.. కలిసి కులక రా
ఉలికి పడకు రా..ఆ ఉడికే వయసు రా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా


చలిలోనా జ్వరబడక.. చెలితోనా జత పడగా
ఏరా మోమాటమా...లేరా.. రారా.. నీదేలే ఛాన్సురా
కవ్వింత నువ్వడుగా..హహ.. నీకింత వెనకడుగా
ఆగే ఆరాటమా... రారా.. కుమారా.. నీదే రొమాన్సురా
యవ్వనమె రివ్వుమనె నవ్వులతో.. ఒసీ.. బిసాగా..

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా

లా లా లలలా లాలా లలలా లలలా

ముదిరిందా ప్రేమకథా.. నిదురంటూ రాదుకదా
కొంగే కోలాటమై... ఈడే.. కోడై.. కొకొరకో అందిరా
పెదవులలో మధు పాత్రా.. వెదకడమే నీ పాత్రా
వలపే నీ వాటమై... ఈడో జోడో.. దక్కిందే నీదిరా
మత్తులలో.. ఒత్తిడిగా.. హత్తుకుపో... ఘుమఘుమగా

కలికి చిలక రా రా రా రా
కలికసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా హే హో

 

శుక్రవారం, ఫిబ్రవరి 08, 2019

అనురాగ సీమ...

కనకదుర్గ పూజా మహిమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కనక దుర్గ పూజా మహిమ (1960)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : పి. బి. శ్రీనివాస్, జిక్కి

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవిచూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ... మనదే సుమా

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవిచూదమా
ఓ హొహొహో...అహహ...అహహ...అహహా...

ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే
చిగురాకు పూబాలలూగే
ఆ....ఆ... ఆ...
తెరవోలె చిరుగాలి పారాడి సాగే
కెరటాలు కోనేట తూగే

ఓ... మధురానుభవమే ఈ జగానా..
మధుమాసమై నేడు శోభించెనా...
ఇలనిండె వలపు ఈ దినానా...
కలలన్ని కనులార కాంతుమా...

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల చవి చూదమా

నెలరాజు నేడేల కనరాక మానే
నీ మోము తిలకించి తలదించెనే....
ఓ...ఆ...ఆ....
పలికేటి చిలుకేల తన పాట మానే
కలకంఠి నీ కంఠమాలించెనే...

కులికింది కళలా ఈ లోకమెల్లా...
పులకించె నిలువెల్ల గిలిగింతలా...
మనలోని ప్రేమా... ఎనలేని ప్రేమా
మనసార తనిదీర సేవింతుమా

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవి చూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ మనదే సుమా

అనురాగ సీమ మనమేలుదామా
ఆనందాల చవి చూదమా
అహా హా హా ...
ఓహో ఓ హో హో హొ హో...


గురువారం, డిసెంబర్ 20, 2018

మధువనిలో రాధికవో...

అల్లరిబావ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల్లరి బావ (1980)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం


మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ..
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ..
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ..
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ..


తొలి తొలీ వలపులే..
తొలకరీ మెరుపులై..
విరిసే వేళలో..హేలలో..డోలలో..

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం
మధువనిలో రాధికనూ..మధువొలికే గీతికనూ


బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ..
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ..

మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా..
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా..

వెలుగులా వీణలే..పలికెనూ జాణలో..
అదియే రాగమో..భావమో..బంధమో..

మధువనిలో రాధికవో..మది పలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం 
 ఆఅహహహా ఆహహహ ఆఆఅహహహాఅ ఆహహహ



శనివారం, నవంబర్ 24, 2018

ఆకాశ వీధులలోన...

రాజు రాణి జాకీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజు రాణి జాకి (1983)
సంగీతం : రాజన్-నాగేద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం 
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

మందార మకరందాలే కురిసింది సుందరహాసం
మందార మకరందాలే కురిసింది సుందరహాసం
మమతలే పరిమళమై హృదయాలు పరవశమై

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం
శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం
ప్రణయమే ప్రణవమనే అందాల అనుభవమే..ఏ
ఈ చైత్రవేళలలోన ఆలాపనై
 
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం
నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం
మనసులే తనువులుగా మధుమాస కోకిలలై 
ఆ ఆ ఆ ఆ హ్హా ఆ ఆ ఆ ఓ ఓ ఓ
నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం
నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం
పరువమే స్వరములుగా సనజాజి సంకెలలై
హేమంత రాత్రులలోన..హిమవీణలై

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం


గురువారం, నవంబర్ 22, 2018

బజ్జోరా నా కన్నా లాలిజో...

మూడు ముళ్ళు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మూడుముళ్ళు (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల

జో..లాలీ..జో జో జో ...
బజ్జోరా నా కన్నా లాలిజో
ఎవరయ్యా నీకన్నా లాలిజో..
ఇల్లాలి లాలిజో..జోలాలి లాలిజో
ఈ..ఇల్లాలి లాలి జో..ఓ ఓ ఓ
జోలాలి లాలిజో...

బజ్జోరా నా కన్నా లాలిజో..
జో జో జో..లాలి జో...

ముద్దూ ముచ్చట తెలిసి బతకర ముద్దుల కన్నయ్యా
ముద్ద పప్పులా పప్పు సుద్దలా మారకు చిన్నయ్యా
మింగటమే తెలుసూ కొందరి పెదవులకూ
ముద్దంటే అలుసూ ఆ మొద్దుల పెదవులకూ
బొమ్మలు అడిగే కన్నా ఓ అమ్మను అడుగు కన్నా
బొమ్మలు అడిగే కన్నా ఓ అమ్మను అడుగు కన్నా
అందాకా ఆపోద్దూ నీ గోలా నే జోల పాడినా హాహా


బజ్జోర నా కన్నా లాలి జో
ఎవరయ్య నీ కన్నా లాలి జో
ఈ నాన్న పాడినా మీ అమ్మా లాలి జో
ఈ నాన్న పాడినా మీ అమ్మా లాలి జో
బజ్జోర నా కన్నా లాలి జో..
జో జో జో..లాలి జో..

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అహహ ఆహహహా ఆ ఆ ఆ హా హా హా

పెదవుల చివరి ముద్దులు మనకు వద్దుర కన్నయ్యా
మంచిన మించిన ముద్దుల పదవులు లేవుర చిన్నయ్యా
నవ్వర నా తండ్రీ నకిలీ ప్రేమలకూ
నమ్మకు నా తండ్రీ ఈ నవ్వే భామలనూ
కనిపించే ప్రతి బొమ్మా కాదుర నాన్న అమ్మా
కనిపించే ప్రతి బొమ్మా కాదుర నాన్న అమ్మా
నీకేలా..ఈ గోలా ఈ వేళా.. ఉయ్యల ఊగరా

బజ్జోర నా కన్నా లాలి జో
ఎవరయ్య నీ కన్నా లాలి జో

ఇల్లాలి లాలిజో..జోలాలి లాలిజో
ఈ..ఇల్లాలి లాలి జో..ఓ ఓ ఓ
బజ్జోరా నా కన్నా లాలిజో
జో జో జో లాలి జో లాలి జో
 


బుధవారం, నవంబర్ 21, 2018

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే...

ప్రణయగీతం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  ప్రణయ గీతం (1981)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
సాహిత్యం :  సినారె
గానం :  బాలు, సుశీల 

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం

నీ వదనమే కమలమై పూచెనా
భావనలే రేకులై నాకై వేచెనా

నీ హృదయమే భ్రమరమై దాగెనా
కోరికలే రెక్కలై నాపై మూగెనా


అహహా...  కాలమే లీలగా ఆడెనా
నీలో ఉన్న నాదాలన్ని నాలో పొంగెనా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా


రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం

నీ పెదవిఏ మురళిఐ పిలిచెనా
రసధునులే రవుళులై నాలో నిలిచెనా


నీ పదములే హంసలై కదలెనా
లయజతులే హొయలులై నాలో ఒదిగెనా

నందనం చేతికే అందెనా
నాలో ఉన్న అందాలన్ని నీలో పండెనా


రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా
రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం 

 

శనివారం, నవంబర్ 17, 2018

దొరలనీకు కనులనీరు...

నాలుగు స్తంభాలాటలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
రచన : వేటూరి
గానం : పి.సుశీల

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాలుగు పాదాల ధర్మం నడువలేని ప్రగతిలో
నాలుగు స్తంభాల ఆట ఆడబ్రతుకు తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే
వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే
కన్నెగానే తల్లివైతే కంటినిండా చుక్కలే
నాల్గు మొగముల బ్రహ్మరాసిన
ఖర్మనీకిది తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో
కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం

శుక్రవారం, అక్టోబర్ 19, 2018

చలికాలమింకా ఎన్నాళ్ళో....

రాగలీల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాగలీల (1987)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళో ఇంకా ఈ దూరం
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ

చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను


చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో

ఈడుకన్నుగీటేనమ్మా
నీడ ముద్దులాడేనమ్మా
రేయి తెల్లవారేదాకా
జోల పాడుకోలేనమ్మా

ఏమి ఎద చాటోనమ్మా
ఎంత ఎడబాటోనమ్మా
మాటపొరపాటైపోతే
మానమే పోతుందమ్మా

వలపే వలలా చుట్టేసే
కలలే కనులు కట్టేసే

చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం


చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ

చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో


సొంత తోడు లేనే లేక
సొమ్మసిల్లి పోయేనమ్మా
సన్నజాజి పూతీగల్లే
సన్నగిల్లి పోయేనమ్మా


కౌగిలింత దాహాలన్నీ
గాలికారబోసేనమ్మ
పట్టలేని మోహాలెన్నో
పాటలల్లుకున్నానమ్మా

కలదో లేదో ఆ భాగ్యం
కలయో నిజమో సౌభాగ్యం

చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళో ఇంకా ఈ దూరం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను

చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ 



బుధవారం, ఏప్రిల్ 11, 2018

మల్లెలు పూసే.. వెన్నెల కాసే..

ఇంటింటి రామాయణం చిత్రం కోసం బాలు గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : యస్ పి బాలసుబ్రహ్మణ్యం

మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా..ఆ..హాహా...హా...ఆ....ఆ...

తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవె
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
 కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కా...సే.. ఈ రేయి హాయిగా


బుధవారం, ఏప్రిల్ 04, 2018

సిరిమల్లె నీవే...

పంతులమ్మ చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
 
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
 
మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే

అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
అహాహాహ ఆహా.. లలలాల లాలా..

 

మంగళవారం, జూన్ 27, 2017

కలికి చిలక రా...

నాలుగు స్తంభాలాట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

హె హె హె హె హె
కలికి చిలక రా.. కలిసి కులక రా
ఉలికి పడకు రా..ఆ ఉడికే వయసు రా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా


చలిలోనా జొరబడక.. చెలితోనా జత పడగా
ఏరా మోమాటమా...లేరా.. రారా.. నీదేలే ఛాన్సురా
కవ్వింత నువ్వడుగా..హహ.. గిలిగింత వెనకడుగా
ఆగే ఆరాటమా... రారా.. కుమారా.. నీదే రొమాన్సురా
యవ్వనమె రివ్వుమనె నవ్వులతో.. ఉలికి.. పడు

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా

లా లా లలలా లాలా లలలా లలలా

ముదిరిందా ప్రేమకథా.. నిదురంటూ రాదుకదా
కొంగే కోలాటమై... ఈడే.. తోడై.. కొకొరకో అందిరా
పెదవులలో మధు పాత్రా.. వెదకడమే నీ పాత్రా
వలపే నీ వాటమై... ఈడో జోడో.. దక్కిందే నీదిరా
మత్తులలో.. ఒత్తిడిగా.. హత్తుకుపో... ఘుమఘుమగా

కలికి చిలక రా రా రా రా
కలికసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా హే హో

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.