సోమవారం, జూన్ 10, 2019

కలికీ చిలకరా...

నాలుగు స్తంభాలాట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

హె హె హె హె హె
కలికి చిలక రా.. కలిసి కులక రా
ఉలికి పడకు రా..ఆ ఉడికే వయసు రా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా


చలిలోనా జ్వరబడక.. చెలితోనా జత పడగా
ఏరా మోమాటమా...లేరా.. రారా.. నీదేలే ఛాన్సురా
కవ్వింత నువ్వడుగా..హహ.. నీకింత వెనకడుగా
ఆగే ఆరాటమా... రారా.. కుమారా.. నీదే రొమాన్సురా
యవ్వనమె రివ్వుమనె నవ్వులతో.. ఒసీ.. బిసాగా..

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా

లా లా లలలా లాలా లలలా లలలా

ముదిరిందా ప్రేమకథా.. నిదురంటూ రాదుకదా
కొంగే కోలాటమై... ఈడే.. కోడై.. కొకొరకో అందిరా
పెదవులలో మధు పాత్రా.. వెదకడమే నీ పాత్రా
వలపే నీ వాటమై... ఈడో జోడో.. దక్కిందే నీదిరా
మత్తులలో.. ఒత్తిడిగా.. హత్తుకుపో... ఘుమఘుమగా

కలికి చిలక రా రా రా రా
కలికసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా హే హో

 

2 comments:

మోస్ట్ యూత్ఫుల్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.