సోమవారం, జూన్ 17, 2019

దొంగ..దొంగ.. ముద్దులదొంగ...

దొంగ చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దొంగ (1985)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు, పి.సుశీల

దొంగ..దొంగ.. ముద్దులదొంగ
దోచాడే బుగ్గ.. కోసాడే మొగ్గ
కౌగిళ్ళన్నీ దోపిళ్ళాయే
ఈ సయ్యాటలో..ఓ
ఈ సందిళ్ళలో..ఓ..

దొంగ..దొంగ..వెన్నెలదొంగ
వచ్చిందే చుక్క వాలిందే పక్క
ఒత్తిళ్ళన్ని అత్తిళ్ళాయే
ఈ ఉర్రూతలో..ఓ
ఈ ఉయ్యాలలో..ఓ..

కొరికే నీ కళ్ళతో
కొరికీ నమిలే ఆ కళ్ళతో
ఇరుకూ కౌగిళ్ళు ఇస్తావనీ..ఈ
చలిగా నీ చూపుతో
చలినే నలిపే నీ ఊపుతో
ఒడికే నీ ఒళ్ళు ఇస్తావనీ..ఈ

వాయిదాలతో పెంచుకొన్నది
వయ్యారాల పరువం..మ్మ్
కొట్టే కన్ను కోరే చూపు
బాణాలేసి.. సన్నంగ
చీకట్లోన సిగ్గుతల్లి..ప్రాణం తీసీ
ఈ తారాటలో
ఈ తైతక్కలో

దొంగ దొంగ
వెన్నెలదొంగ
వచ్చిందే చుక్క
వాలిందే..ఏ..పక్కా

కొసరే నీ చూపులో
కసిగా ముసిరే కవ్వింపులో
పిలుపో వలపో విన్నానులే
ఎదిగే నీ సోకులో
ఎదిగి ఒదిగే నాజుకులో
ఉలుకో తళుకో..చూశానులే..

పక్క వత్తిడి పక్కపాపిడి
ఇలా చెదరిపోనీ..ఈ
నచ్చేదిస్తే ఇచ్చేదిస్తా
సాయంకాలం..ఓలమ్మో
వెచ్చందిస్తే మెచ్చిందిస్త
శీతాకాలం..మ్మ్
హా..నా దోసిళ్ళతో..
హా..నీ దోపిళ్ళలో..ఓ

దొంగ..దొంగ..
ముద్దులదొంగ
దోచాడే...బుగ్గ..
కోసాడే....మొగ్గ
వత్తిళ్ళన్ని.. అత్తిళ్ళాయే..
ఈ ఉర్రూతలో..
ఈ ఉయ్యాలలో
హా..హా హా హా హా హా
హే హే హే హే హే హే  

 

2 comments:

మా వరకూ చిరంజీవి,రాధ బెస్ట్ కాంబినేషన్..

అవునండీ ఎవర్ గ్రీన్ డాన్సుల్లో చిరుకి సరి జోడీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.