రాగ దీపం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాగదీపం (1982)
సంగీతం : కె. చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్యా రాగాలు
కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్యా రాగాలు
అవి మౌన గీతాలై..
చెలి మందహాసాలై..
నా కోసం విరిసిన కుసుమాలు
కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్యా రాగాలు
కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై..
మన ప్రణయ గీతాలై..
నా సిగలో విరిసిన కుసుమాలు
ఎదలే..తుమ్మెదలై..
వినిపించే ఝంకారం
పెదవులు త్వరపడితే
వలపుకు శ్రీకారం
కనులే.. కౌగిలులై..
కలిసే సంసారం
పరువపు ఉరవడిలో..
మనసులు ముడివడుతూ
తొలిసారి కలిసెను ప్రాణాలు
తెలిసాయి జీవన దాహాలు
కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై..
మన ప్రణయ గీతాలై..
నా సిగలో విరిసిన కుసుమాలు
కలలే..కలయికలై..
చిగురించే శృంగారం
ప్రేమకు గుడి కడితే..
మన ఇల్లే ప్రాకారం
మనసే.. మందిరమై..
పలికే ఓంకారం..
వలపుల తొలకరిలో..
తనువులు ఒకటౌతూ...
తొలిసారి పలికెను రాగాలు..
మనసార మధుర సరాగాలు
కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్యా రాగాలు
అవి మౌన గీతాలై..
చెలి మందహాసాలై...
నాకోసం విరిసిన కుసుమాలు
2 comments:
మా అక్కయ్యకి ఇష్టమైన పాట..థాంక్స్ ఫర్ పోస్టింగ్..
ఓహో అవునా.. ఆ విషయం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.