పున్నమి నాగు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పున్నమి నాగు (1980)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు
ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ..
పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..
పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఆ...
మగువ సోకులే మొగలి రేకులయి
మత్తుగ పిలిచే రాత్రీ...
మరుడు నరుడిపై..మల్లెలు చల్లి
మైమరిపించే రాత్రీ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ..
ఆ వేదనలో..ఓ..ఓ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ..
ఆ వేదనలో..ఓ..ఓ..
నాలో వయసుకు నవరాత్రీ..ఈ..
కలగా మిగిలే కడ రాత్రీ..
పున్నమి రాత్రీ..ఆ...ఆ...
పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ....
కోడెనాగుకై కొదమనాగిని..
కన్నులు మూసే రాత్రీ....
కామ దీక్షలో కన్నెలందరూ..
మోక్షం పొందే రాత్రీ..
నా కౌగిలిలో..ఓ..ఓ..
ఈ రాగిణీతో..ఓ..ఓ..
నా కౌగిలిలో..ఓ..ఓ..
ఈ రాగిణీతో..ఓ..ఓ..
తొలకరి వలపుల తొలిరాత్రీ..
ఆఖరి పిలుపుల తుదిరాత్రీ..
పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ...
పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..
2 comments:
చిరు ని అలా చూడటం అప్పుడూ ఇప్పుడూ యెప్పుడూ కష్టమే..
హహహ ట్రూ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.