శనివారం, జూన్ 22, 2019

పెళ్లి పెళ్లి ఇప్పుడే...

ధృవనక్షత్రం సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ద్రువనక్షత్రం  (1989)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు, జానకి  

పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి

నాకొద్దీ ఆరాటం... నీ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు

 
పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి

నాకొద్దీ ఆరాటం... నీ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు

తత్వమసి... డిప్లమసి పనికి రావురా
తాళిబొట్టు తగిన జట్టు తప్పు కాదురా

కొంప అనే కుంపటినే నాకు పెట్టకు
కొంగు ముడి రంగు తడి నాకు గిట్టదు
ప్రేమ అమృతం.. ప్రేమ జీవితం..
నవ్వేటి యవ్వనమే ప్రేమకంకితం


పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి

నాకొద్దీ ఆరాటం... నీ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు

సీత సొద రామ వ్యధ విన్నదే కదా
పెళ్లి కథ ఓటి కథ ఎందుకే రొద
అమ్మ కథ నాన్న కథ పెళ్ళియే కదా
గంతకొక బొంత ఇక ఫిక్సుడే కదా

ప్రేమ కులాస.. అదే ప్రేమ బరోసా
ఏనాడు తీరనిదే ప్రేమ పిపాసా

 
పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి

నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం
నన్నే వరించు... ప్రేమించి తరించు
అబ్బ.. వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు 


2 comments:

ఆ రోజుల్లో హిట్ సాంగ్..

అవునండీ.. హవా హవా అనే హిందీ సాంగ్ ట్యూన్ లో చేసిన పాట కదా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.