మంగళవారం, జూన్ 04, 2019

చిలక పచ్చనీ చీరలోన...

జీవిత నౌక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీవిత నౌక (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : ఎస్.పి.బాలు, సుశీల

చిలకపచ్చని చీరలోనా
చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
చిట్టమ్మి... నీ మీద ఒట్టమ్మి...హహహహహ

చిలకపచ్చని చీరలోనా
చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... హహహహహహహా

చిలకపచ్చని చీరలోనా....

సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
నా పెదవులు నిన్నడిగితే... ముడుపుగా ఇచ్చుకో

ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చిన ఆ వేళలో... ఎన్నెన్ని తీపి మెరుపులో

చిలకపచ్చని చీరలోనా
చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకనీ... ఓరబ్బి ఎవరికని...
లరలరలరలరలర
చిలకపచ్చని చీరలోనా...

చల్లని నీ రూపమే... నా కళ్ళలోనీ కాటుకా
చల్లని నీ రూపమే... నా కళ్ళలోనీ కాటుకా
పచ్చని నా పరువమే... నీ దోసిట కానుక

నీ కాటుక కన్నులే... నా కలలకు పొదరిళ్ళు
నీ కాటుక కన్నులే... నా కలలకు పొదరిళ్ళు
వేసేను ఆ కలలే... విడిపోని మూడుముళ్ళు

చిలకపచ్చని చీరలోనా
చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
ఎందుకనీ... ఓరబ్బి ఎవరికని...
ఇందుకనీ... చిట్టమ్మి ఇందుకేనని


2 comments:

బ్యూటిఫుల్ పిక్..

థాంక్స్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.