సోమవారం, జూన్ 03, 2019

అమ్మతోడు..అబ్బతోడు..

అడవి రాముడు చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అడవి రాముడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల, జానకి

అమ్మతోడు...అబ్బతోడు
నా తోడు...నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు
ఇంకెన్నటికి నేనే నీ తోడు

అమ్మతోడు...అబ్బతోడు
నా తోడు...నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు
ఇంకెన్నటికి నేనే నీ తోడు

ఆకలన్నదే లేదు హరహరా.. రామరామా
అన్నమే రుచికాదు శివశివా.. కృష్ణకృష్ణా
ఆకలన్నదే లేదు హరహరా
అన్నమే రుచికాదు శివశివా
వెన్నెలొస్తె వేడిరా నా దొరా
ఆ వేడిలోనే చలేసింది రా

ఆకలన్నదే నీకు లేకపోతే 
ఈ కేకలెందుకే రాకపోకలెందుకే..
ఒట్టిమాటలింక నీవు కట్టిపెట్టు.. ఓహో
నీ ఒట్టు తీసి గట్టుమీద అట్టిపెట్టు.. ఆఆఅ..

అమ్మతోడు...అబ్బతోడు
నా తోడు...నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు
ఇంకెన్నటికి నేనే నీ తోడు

కళ్ళు కాయలు కాచే హరహరా.. ఈశ్వరా
నిన్ను చూడకమాకు శివశివా.. శ్రీహర
కళ్ళు కాయలు కాచే హర హరా
నిన్ను చూడక మాకు శివ శివా
పొద్దె గడవదు మాకు ఓ దొరా
నిద్దరన్నదే లేదు రా

నిద్దరన్నదే నీకు లేకపోతే
ఈ పిలుపులెందుకే
ఆ కులుకులెందుకే
గుట్టు బైట పెట్టుకుంటే పెద్ద ఒట్టు
గట్టు మీద చిలక వింటే గుట్టు రట్టు

అమ్మతోడు... అబ్బతోడు
నా తోడు... నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు
ఇంకెన్నటికి నేనే నీ తోడు

ఆ శివుడే వరమిచ్చాడే
అదిరిపడకే ఆడివి జింకా.. హా..
అంబ పలికే జగదంబ పలికెనే
ఆశవదులుకో నీవింకా.. ఆహాఁ..

భోళా శంకరుడయినా
నిన్ను బొల్తాకొట్టించాడమ్మా
చిత్తైపోయావమ్మో
ఓ సిగ్గులదొరసానమ్మా

తెల్లారే తల్లో పూలు పెట్టుకురమ్మన్నాడు
తేల్లారకనే తలస్నానం చేసి రమ్మన్నాడు
చిటికెడు విబూది ఇచ్చాడు..
పిడికెడు నాకు ఇచ్చాడు..
అమ్మతోడు అందాల రాముడు నా వాడన్నాడు
నా అన్న వాడు అడవి రాముడు మా తోడన్నాడు
అందుకే వాడు నా వాడు
కాడు కాడు... కాలేడు
మ్మ్.. అబ్బ.. అమ్మా...

అమ్మ తోడు అబ్బ తోడు
నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు
ఇంకెన్నటికి నేనే మీ తోడు
అమ్మ తోడు అబ్బ తోడు
నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు
ఇంకెన్నటికి నేనే మీ తోడు
ఇంతటితో ఆపండి మీగోడు 


2 comments:

సూపర్ హిట్ సాంగ్..

అవునండీ.. థాంక్స్ ఫర్ ది కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.