శనివారం, జూన్ 08, 2019

అభినవ శశిరేఖవో...

గృహప్రవేశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గృహప్రవేశం (1988)
సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం : జలాది రాజా రావు
గానం : ఎస్.పి.బాలు, జానకి

అభినవ శశిరేఖవో
ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో
ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల
నెలవంక నీవో

నవయువ కవిరాజువో
ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల
భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో
ప్రియతమ నెలరాజువో

ఆ కనులు ఇంద్ర నీలాలుగా
ఈ తనువు చంద్రశిఖరాలుగా
కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై
కల్యాణ వీణ స్వరగీతమై
శ్రుతి చేయు జతగాడివే

ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో
అభినవ శశిరేఖవో

నా వయసు వలపు హరివిల్లుగా
నవపారిజాతాల పొదరిల్లుగా
రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే
నీ నుదుటి తిలక సింగారమై
నూరేళ్ళు వెలిగించనా

నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా

అభినవ శశిరేఖవో
ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల
నెలవంక నీవో 
 
నవయువ కవిరాజువో
ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల
భ్రమరమ్ము నీవో

అభినవ శశిరేఖవో
ప్రియతమ నెలరాజువో 
 

2 comments:

బాలుగారి స్వరాల తోటలో మరో అందమైన పాట..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.