శుక్రవారం, జూన్ 14, 2019

మౌనం ఆలాపన...

స్రవంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్రవంతి (1985)
సంగీతం : కె. చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి. బాలు, సుశీల

మౌనం ఆలాపన..
మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం..
కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో..
కావ్యమై మిగిలిపో
తొలి రేయి నీడలో.. హో

మౌనం ఆలాపన
మధురం ఆరాధన

కలలే నిజమై.. పది కాలాల
బంధాలు ముందుంచగా...
యుగమే క్షణమై.. అనురాగాల
హరివిల్లు అందించగా...

దివిలో మెరిసే
ఆ నక్షత్ర నాదాలు వినిపించగా
మధుమాసానికి పూల ఉగాది
శతమానానికి ప్రేమే నాంది
 వేవసంతాలు సొంతాలుగా చేసుకో
మందహాసాల మందార పూదోటలో
ఆ...ఆ...ఆ..

మౌనం ఆలాపన
మధురం ఆరాధన

ఇహమో పరమో
తీపి కన్నీటి కెరటాలు పొంగించగా
శుభమో సుఖమో
తేనె వెన్నెల్లో తెల్లారి పోతుండగా
ఒరిగే తులసీ
మౌన గంధాల గానాలు వినిపించగా

కనివిని ఎరుగని సంగమ వేళ
గుప్పెడు మనసుల ఆశల హేల
లేత చిరునవ్వునే పాపగా పెంచుకో
రాలు కుసుమాల రాగాలనే తెలుసుకో
ఆ..ఆ...ఆ..

మౌనం ఆలాపన
మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం
కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో
కావ్యమై మిగిలిపో
తొలి రేయి నీడలో
మౌనం ఆలాపన
మధురం ఆరాధన


2 comments:

పిక్ చాలా యాప్ట్ గా ఉంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.