మంగళవారం, జూన్ 11, 2019

ముత్యాల పందిరిలో...

ముద్దుల మేనల్లుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముద్దుల మేనల్లుడు (1990)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వెన్నలకంటి
గానం : యస్.పి.బాలు, చిత్ర

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్ని పండేదెపుడెమ్మా

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైదు భాగ్యాలిస్తుంది

ఇది మొదలేనమ్మ
ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయి లోన దోర వయసు
వాయనాలు ఇవ్వాలమ్మ

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైదు భాగ్యాలిస్తుంది

పసుపు పారాణి
బొట్టు కాటుక దిద్దిన
నా రాణి నాకే కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షిగా
మాటే మనుగడగా మనమే పాటగా

సాగాలి జీవితము
చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం
గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే
సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గమేసి
నెగ్గెనమ్మ లగ్గమంటూ

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ
మూర్తం ముందుంది
ఓ చిలకమ్మా ముత్తైదు
భాగ్యాలిస్తుందీ

తేనెకు తీయదనం
తెలిపే ముద్దులో
వయసుకు వెచ్చదనం
తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం
కలిగే రేయి లో
వలపుల మూల ధనం
పెరిగే హాయిలో
అందాల వెల్లువలో
వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడుగా
వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు
వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీటగా
జాజుల వాన చాటుగా
ఈ కొంగు కొంగు కూడే
రంగ రంగ వైభవం గా 

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ముందుంది 
ఓ చిన్నమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్ని పండేదెపుడెమ్మా


2 comments:

అందమైన పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.