శుక్రవారం, జూన్ 28, 2019

చిటపట చినుకుల మేళం...

ముద్దులకొడుకు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముద్దుల కొడుకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, సుశీల

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం
 
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ఇద్దరమా వెచ్చదనం ఇచ్చిపుచ్చుకుంటుంటే
తహతహ తహతహ తహతహలో

తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు హాయ్
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు
వయసున్న వాళ్ళకే.. వల్లమాలిన జబ్బులు

తహతహ తహతహ తహతహలో

తహతహ తహతహ తహతహలో

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
ఆ ఆ చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
మన కోసం ప్రతి మాసం.. మాఘమాసమై పోతుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
ఈ వద్దుకు అర్ధం మారి మన హద్దులు రద్దౌతుంటే


తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరుమీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం


చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం  

 

2 comments:

వర్షం లో తడుస్తున్నట్టే ఉంది..

హహహ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.