శనివారం, జూన్ 01, 2019

ప్రేమిస్తే పెళ్లవుతుంది...

భలే అల్లుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలే అల్లుడు (1977)
సంగీతం : జె.వి. రాఘవులు
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ప్రేమిస్తే ఏమవుతుంది?.. హ్మ్... హ్మ్... పెళ్ళవుతుంది
పెళ్ళైతే ఏమవుతుంది? .. ఆహహ ఏమవుతుంది.. ఒక ఇల్లవుతుంది

ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ... హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది.. ఆహా.. పెళ్ళికి ఒక రూపొస్తుంది

మనసుంటే ప్రేమ తానె పుట్టుకొస్తుందీ
వయసొస్తే వద్దన్నా నెట్టుకొస్తుందీ..

పగ్గాలు తెంచుకొని పరుగులెత్తుతుంది
పసుపు తాడు పడగానే అదుపులోకి వస్తుంది

ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ..  హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది.. ఆహా.. పెళ్ళికి ఒక రూపొస్తుంది

ప్రేమంటే వెన్నెల్లా చల్లనైనది
ప్రేమంటే తేనెలా తీయనైనది
ప్రేమంటే అదో రకం పిచ్చి వంటిది
పెళ్ళే ఆ పిచ్చికి మందు వంటిదీ


ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది

ప్రేమకు ఒక ఊపొస్తుందీ... హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది

నిన్న మొన్న దాక నిన్ను నువ్వెవ్వరు అన్నది
వలపు మొలిచినంతనే నువ్వే నేనంటుంది
నువ్వు లేక నేలేనని.. పువ్వు తావి మనమని
గుండెలోన దాగుతుంది.. కోరికలు రేపుతుంది

ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది

ప్రేమకు ఒక ఊపొస్తుందీ... హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది...  

 

2 comments:

భలే మంచి పాట..

థాంక్స్ ఫర్ ది కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.