ఇరవయ్యవ శతాబ్ధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేడా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : 20 వ శతాబ్దం ( 1990 )
సంగీతం : జె.వి. రాఘవులు
సాహిత్యం : వేటూరి
గానం : పి.సుశీల, యస్.పి.బాలు
నా ప్రేమ నవ పారిజాతం...
పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం...
పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై మన కథ మీటగా
నీ ఎద వీణపై మన కథ మీటగా
అనురాగాల రాదారి రానా
నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం..
పలికింది ప్రియ సుప్రభాతం
వేదంలో స్వరంలా స్థిరంగా..
సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై...
నిలవాలి వరాలై నిజాలై
గత జన్మ బంధాలు నేడు
జతగూడి రావాలి తోడు
గగనాల పందిళ్లలోనా
సగభాగమవుతాను నీకు
ఇక సుముహూర్త మంత్రాలలోనా
శృతి చేయి అనురాగ వీణ
నా ప్రేమ నవ పారిజాతం...
పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం...
పలికింది ప్రియ సుప్రభాతం
ఈనాడే ఫలించే తపస్సే
ప్రేమించి వరించే వయస్సే
లోకాలే జయించే మనస్సే
నీకొసం నిజంగా తపించే
సరసాల సమయాలలోనా
మనసార పెనవేసుకోనా
అనువైన నా గుండెలోనా
కడదాక నిను దాచుకోనా
ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా
పరువాలు పండించుకోనా
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై మన కథ మీటగా
నీ ఎద వీణపై మన కథ మీటగా
అనురాగాల రాదారి రానా
నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
4 comments:
అనురాగాల రాగాన్నై రానా...
అని ఉండాలేమో శ్రీకాంత్ గారూ.
ముందుగా బ్లాగ్ ను శ్రద్దగా ఫాలో అవుతూ సవరణ సూచించినందుకు థాంక్స్ ఎ లాట్ భవానీ గారు.. నెట్ లో ఉన్న లిరిక్స్ చాలావాటిలో "రాగాన్నై రానా" అనే ఉందండీ.. కానీ పాటలో అనురాగాల రాదారి(రహదారి) రానా అనే పాడారు బాలు గారు. పైన ఇచ్చిన ఆడియో లింక్ లో క్లారిటీ బావుంది మరో సారి విని చూడండి.
పిక్ అద్భుతహా..
థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.