మంగళవారం, జూన్ 25, 2019

కొండ కోనా తాంబూలాలే...

రాజా విక్రమార్క చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజా విక్రమార్క (1990)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు, యస్.జానకి

ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా..
ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా..  
ఏలేలో.. ఏలేలో..
కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట
కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట
ఎంకి పాట పాడుకుంటూ
ఎన్నెలంతా పంచుకుంటు
గోరింట పండేటి వాలింటి పొద్దుల్లో
నీ జంట నేనుంటె
కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట
కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహో..

ఏలేలో.. ఏలోఏలో..
ఎదలోకి జరుగు పొదరింట కరుగు
నే ముట్టుకున్న నా ముద్దబంతి ముద్దుకే జల్లెడ
చినవాడి పొగరు చిగురాకు వగరు
లోగుట్టులాగ నే తట్టుకుంట సాగిపో చంద్రుడా
పచ్చంగా మెరిసేటి నీకళ్ళు
రామ చిలకమ్మ గారాల పుట్టిళ్ళు
గారంగ పట్టేటి కౌగిళ్ళు
కన్నె వలపమ్మ నాట్యాల నట్టిళ్ళూ
విరబుసిన పులకింతల పందిట్లొ

ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా..
ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా.. 
కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట
కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహోయ్

హోలా.. హోలా.. హోలా.. హోలా..
పెదవింత కొరుకు మధువింత దొరుకు
చిన్నోళ్ళ జంట వెయ్యేళ్ళ పంట వెన్నలో మీగడ
తొలి సిగ్గు చెరిపే చలి ముగ్గులెరుపు
మా ప్రేమ తంటా నీకెందుకంటా వెళ్ళిపో సుర్యుడా
మూగేటి చీకట్ల మేఘాలు
నన్ను తాకేటి నీ ప్రేమ దాహాలు
అలిగేటి నీ కంటి దీపాలు
ముద్దులడిగేటి నీ కన్నె తాపాలు
ముసి నవ్వుల ముఖ వీణల ముంగిట్లొ

ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా..
ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా.. 
కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట
కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహో


4 comments:

నైస్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

Dear Srikanth, your interest and passion to display our father's lyrics is very much appreciated, your taste to add relevant pictures to portray the song mood is very interesting, keep it up and all the best, Veturi Ravi Prakash

థాంక్స్ ఎ లాట్ రవిప్రకాష్ గారు... మీ ప్రశంస నాకు కొండంత ప్రోత్సాహాన్నీ సంతోషాన్నీ ఇచ్చిందండీ.. శ్రమ తీసుకుని కామెంట్ ద్వారా తెలియజేసినందుకు వేవేల ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.