ఆదివారం, జూన్ 16, 2019

ఊహవో... ఊపిరివో...

సువర్ణ సుందరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు మనం తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సువర్ణ సుందరి (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం :  వేటూరి
గానం :   బాలు, జానకి

ఊహవో... ఊపిరివో... నా జీవన రసమాధురివో
ఊహవో... ఊపిరివో... నా జీవన రసమాధురివో
వివర్ణమైన ఆశల ముంగిట... సువర్ణ సుందరివో
ఇదే నా స్వాగతం... నీవే నా జీవితం

ఊహవో... ఊపిరివో... నా జీవన రసమాధురివో
వివర్ణమైన ఆశల ముంగిట... సువర్ణ సుందరివో
ఇదే నా స్వాగతం... నీవే నా జీవితం

చీకటి తీవెల రాతిరి వీణియ 
నవ్విన వేకువ చూపులని
ఆమని తేనెల వాగుల పొంగిన 
తీయని అలలే మాటలని
కంకణముల సడి పాటలుగా
కలికి అందియల ఆటలుగా
ఎడదల చప్పుడు తాళముగా
విడుదల ఎరుగని కౌగిలిలో...

కనుపాపలు తానాలాడే
ఆషాడపు అభిషేకంలో
ఏడుజన్మలిటు...  ఆరు ఋతువులై
నూరు శరత్తులు విరిసిన వేళ


ఉదయరేఖ నుదుటదిద్ది.... కదలిరావే నా సుందరి
ఓ నా ఉషస్సుందరి.....

ఊహవో... ఊపిరివో... నా జీవన రస మాధురివో

వెన్నెలసణిగే వెండిమువ్వలో 
సన్నని లయ నా హృదయమని
కిన్నెర పలికే చిలిపి ముద్దులో 
చల్లని శృతి నా ప్రణయమని
గగన నీలిమలు కురులుగా 
ఉదయరక్తిమలు పెదవులుగా
హరిత చైత్రములు చీరెలుగా 
శరణ్మేఘముల నడకలలో

నిన్ను తాకిన హేమంతంలో 
సుడిరేగిన సంగీతంలో
సప్తవర్ణములు సప్తస్వరాలై 
సప్తపదులు నడిపించిన వేళా
కలలు వీడి.. ఇలకు చేరి 
కలిసిపొవె నా సుందరి 
ఇంద్రధనుస్సుందరీ

ఊహవో...  ఊపిరివో... నా జీవన రసమాధురివో
వివర్ణమైన ఆశల ముంగిట... సువర్ణ సుందరివో
ఇదే నా స్వాగతం... నీవే నా జీవితం 


4 comments:

బాలుగారి గొంతు మధురాతి మధురం..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

థాంక్స్ ప్రవీణ్ గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.