మంగళవారం, జూన్ 18, 2019

గోరింట పొద్దుల్లో...

విజేత విక్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విజేత విక్రమ్  (1987)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : వెన్నలకంటి
గానం : యస్.పి.బాలు, పి.జానకి

గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
ఆహా పొందులో ప్రేమ విందులో
పొందులో ప్రేమ విందులో


కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నుల్లో తొలివలపు కళలారాబోసింది జాణలా
రాణిలా కన్నె వీణలా
రాణిలా కన్నె వీణలా

చామంతి నిగ్గు చంగావి సిగ్గు
చెక్కిళ్ళ కురిసేటి వేళ
అరె ఈ వాలుపొద్దు ఓ పూల ముద్దు
కౌగిళ్ళు కోసరేటి వేళ
గుండెలోన కొత్త కోరుకుంది
చెప్పబోతే గొంతు దాటకుంది

గోదారి పొంగల్లె దూకేటి
నీ ఈడు నా దారికొచ్చింది లేవమ్మో
నీ దారి నాదారి ఒకటైన వయసల్లే రావయ్యో..
అల్లుకో అల్లిబిల్లిగా మత్తుగా గమ్మత్తుగా

గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో

రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా

అందాల కొమ్మ అపరంజి బొమ్మ
తోడుంటే తీరేను తాపం
ఆ నీలి కళ్ళ వాకిళ్లలోన
మెరిసేను ఆకాశ దీపం
తీరకుంది తీపి దాహమేదో
ఆరకుంది వింత మోహమేదో

మొగ్గల్లే నువ్వొస్తే సిగ్గిల్లే సిరిమల్లి
సిగురాకు సొగసంత నాదమ్మో
ఈ పూల పందిళ్లు
మురిపాల సందిళ్ళు నీకయ్యో

మెత్తగా పూల గుత్తిగా హత్తుకో కొత్త కొత్తగా

కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
రాణిలా కన్నె వీణలా
ఆహా పొందులో ప్రేమ విందులో  

5 comments:

జానకి గారి కంఠంలాగా ఉందండీ శ్రీకాంత్ గారూ.... ఒక్కసారి చూడండి.

థాంక్స్ భవానీ ప్రసాద్ గారు.. పోస్ట్ అప్డేట్ చేశాను.. పాట విన్నపుడు నాక్కూడా అనిపించింది కానీ సోర్స్ చెక్ చేసే అవకాశం లేక నెట్ లో ఉన్నదే ఉంచేశానండీ.

కనులు మూసుకుని వింటే చాలా బావుంటుందీ పాట..

హహహ కరెక్ట్ గా చెప్పారండీ.. అప్పట్లో ఆడియో కాసెట్స్ లోనూ రేడియోలోనూ ఎక్కువ వినేవాళ్ళం కదా అలా హిట్ అయిన పాటే ఇది..

బైదవే థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.