శనివారం, జూన్ 15, 2019

ఆకాశమా నీవెక్కడ...

వందేమాతరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వందేమాతరం (1985)
సంగీతం : కె. చక్రవర్తి
సాహిత్యం : సినారె
గానం : ఎస్.పి. బాలు, ఎస్. జానకి

ఆకాశమా నీవెక్కడ
అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ
అవని పైనున్న నేనెక్కడా

ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా
నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ
అవని పైనున్న నేనెక్కడా

నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాళ్లున్న  నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా

ఆకాశమా.. ఆఆ... లేదక్కడ..
ఆకాశమా లేదక్కడ
అది నిలిచి ఉంది నీ పక్కన
వేల తారకలు తనలో వున్నా
వేల తారకలు తనలో వున్నా
నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ 
అది నిలిచి ఉంది నీ పక్కన

వెలలేని నీ మనసు కోవెలలో
నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో
నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో
నను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ
సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ
అది నిలిచి వుంది నా పక్కన
వేల తారకలు తనలో వున్నా
వేల తారకలు తనలో వున్నా
నేలపైనే తన మక్కువ
ఈ నేలపైనే తన మక్కువ 

2 comments:

అద్భుతమైన సాహిత్యం..

అవునండీ.. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.