ఆదివారం, జూన్ 02, 2019

పగడాల దీవిలో...

దొంగలకు దొంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దొంగలకు దొంగ (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు, సుశీల

పగడాల దీవిలో.. పరువాల చిలక
తోడుగా చేరింది.. పడుచు గోరింక
ఓయమ్మ నీ అందం.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు

ముత్యాల కోనలో.. గడుసుగోరింక
ఆశగా చూసింది.. చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు


ఎరుపేది మలిసంధ్యలో.. ఓ
అది దాగింది నీ బుగ్గలో
వెలుగేది తొలిపొద్దులో.. ఓ
అది తెలిసింది నీ రాకలో

ఆ..ఎన్నడు చూడనీ.. అందాలన్నీ
ఎన్నడు చూడనీ.. అందాలన్నీ
చూశాను ఈ బొమ్మలో..ఓ..హా

ముత్యాలకోనలో.. గడుసు గోరింక
ఆశగా చూసింది చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు


నీ చిలిపి చిరునవ్వులే..ఏ
ఊరించే నా వయసునూ

ఓ..హో..ఆ సోగ కనురెప్పలే..ఏ
కదిలించే నా కోర్కెనూ
ఆ.. నీవే నేనై తోడు నీడై..
నీవే నేనై తోడు నీడై
నిలవాలి నూరేళ్ళకు..


పగడాల దీవిలో పరువాల చిలక
తోడుగా చేరింది పడుచు గోరింక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు


ఓయమ్మ నీ అందం వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు

 

2 comments:

70స్/80స్ పాటలు చాలా బావుంటాయి..

అందులోనూ నేను అప్పట్లో రేడియోలో పదేపదే విన్న పాటలు కావడం వలన నాకు ఇంకా ఎక్కువ ఇష్టమండీ. థాంక్స్ ఫర్ ది కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.