శుక్రవారం, జూన్ 21, 2019

నిన్ను కన్నా...

స్వాతి చినుకులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వాతిచినుకులు (1989)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : మనో, జానకి

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..లాలలా..లాలలాల
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ 
నిన్ను కన్నా..

నీ కళ్ళు పాడేటి..కధలు..ఊఊఊ 
అధరాలలో..పొంగు సుధలు..ఊఊఉ
ఇటు ప్రేమించుకున్నాక..ఎదలు..ఊఊఊ
పేరంట మాడేటి...పొదలు..ఊఊఊఉ
చేమంతిపూల..సీమంతమాడే
హేమంత వేళ..ఈ రాసలీల
వెయ్యేళ్ళ వెన్నెల్లు..కాయాలిలే

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా

కౌగిళ్ళలో పండు..కలలు..ఊఊఉ
వేవిళ్లలో దాటు..నెలలు..ఊఊఊ
బిగిసందిళ్లకేటందు..కళలు..ఊఊఉ
సందేళ మందార..గెలలు..ఊఊఉ
రాసేదికాదు..ఈ చైత్రగీతం
రాగాలు తీసే..ఈ ప్రేమవేదం
పూలారబోసింది..ఈ తోటలో

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు..ఆ..నీకు నేను..ఆ
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..

 

2 comments:

చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి..థాంక్యు ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.