తోడూ నీడా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తోడు నీడ (1983)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
నా తోడువై..నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
నా తోడువై... నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
నీ రూపం కలకాలం
నా ఏదలొ కదలాడే
అపురూప అనురాగ దీపం
నీ నవ్వుల సిరి మువ్వల
చిరునాదం
ప్రతి ఉదయం వినిపించు
భూపాల రాగం
మన లోకం.. అందాల లోకం
మన గీతం.. ఆనంద గీతం
మన బ్రతుకు తుది లేని
సెలయేటి గానం
నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
నీ చెంపల ఎరుపెక్కే
నును కెంపుల సొంపులలో
పూచింది మందార కుసుమం
నీ మమతలు విరజల్లే
విరి తేనెల మదురిమలో
విరిసింది నవ పారిజాతం
నీ రాగం...అతిలోక బందం
నీ స్నేహం...ఎనలేని దాహం
అనుదినము ఒక అనుభవం
రసమయ సంసారం
నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
2 comments:
ఈ పాట యెన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంటుంది..
అవునండీ.. చక్రవర్తి గారు ఎంత బీట్ సాంగ్స్ కంపోజ్ చేస్తారో కొన్ని అంత మంచి మెలోడీస్ కంపోజ్ చేశారు..థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.