ఆదివారం, జూన్ 30, 2019

అందగాడా అందుకోరా...

అత్తింట్లో అద్దెమొగుడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అత్తింట్లో అద్దెమొగుడు (1991)
సంగీతం : యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం : యమ్.యమ్.కీరవాణి
గానం : చిత్ర

అందగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ
చందురూడా నిండిపోరా
చుక్కలాంటి చిన్నదాని గుండెనిండా
తూరుపింట వేగుచుక్క పొడవకుండా
హ కన్నెపిల్ల సిగ్గులన్ని తడవకుండా
అర్ధరాత్రి కోరికంత ఆరకుండ
ఆశపెట్టి పారిపోకు కోరుకొండ

అందగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ


ఆకుముక్క లవంగి పోకచెక్క
బిగించు తాంబూలమే ఎంగిలి
తోకచుక్క తడుక్కి చెమ్మచెక్క
సుఖించు నారీమణి కౌగిలి
ఈ ఎడారి క్లబ్ లో
వెన్నెలమ్మ పెగ్గులో
ఈ ఎడారి క్లబ్ లో వెన్నెలమ్మ పెగ్గులో
వేడిముద్దులే నంచుకో

పిల్లసోకు మండపేట పూతరేకు
అందుబాటులోనే ఉంది ముందు మాకు
టముకువేసి టౌన్ కంత చెప్పమాకు
తమకమంత తాగినేల దింపమాకు


అందగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ


పైటకొంగు అరెస్ట్ చేసుకున్న
చమక్కు జామీను కోరిందిలే
పూల పక్క నలక్క పాపిడంత
చెరక్క ఆనందమేముందిలే
కోడితాచు కోరిక
ఉండనీదు ఊరక
కోడితాచు కోరిక ఉండనీదు ఊరక
సంపంగి సయ్యాటలో

వైఫ్ లాగ చిక్కినావే అమ్మలాలో
లైఫ్ లాంగ్ దక్కనీవే శోభనాలు

బుగ్గకంద నివ్వమాకు బుజ్జిలాలో
బూర గంప తన్నిపోకు బూజిలాలో

అందగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ
చందురూడా నిండిపోరా
చుక్కలాంటి చిన్నదాని గుండెనిండా
తూరుపింట వేగుచుక్క పొడవకుండా
హ కన్నెపిల్ల సిగ్గులన్ని తడవకుండా
అర్ధరాత్రి కోరికంత ఆరకుండ
ఆశపెట్టి పారిపోకు కోరుకొండ

అందగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ  


2 comments:

మామూలు హుషారుగా లేదుగా..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.