బుధవారం, జూన్ 19, 2019

తళుకు తాంబూలమిస్తా...

అనసూయమ్మ గారి అల్లుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అనసూయమ్మ గారి అల్లుడు (1986)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు, పి.సుశీల

తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డాణమెడతా
తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డాణమెడతా
నన్నే పెళ్ళాడతావ కన్నె చిలకా

పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
నన్నేలుకుంటావా గోరింకా


కోకిలమ్మ సన్నాయితో
నెమిలమ్మ మేజువాణితో
కోకిలమ్మ సన్నాయితో
నెమిలమ్మ మేజువాణితో
మారాకు మంచమేసి చిగురాకు చీరకట్టి
నాజూకు సారె పెట్టి నీ సోకు బుగ్గనెట్టి
రేయంత నెమరేస్తుంటే...
అందాల ఆవిరంత గంధాల కోటలైతే
మర్యాద చేసుకుంటాలే...

చిలకల కొలికికి పులకలు పుట్టి
తడిమిన చేతికి తపనలు పుడితే

పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
నన్నేలుకుంటావా గోరింకా


మందార మలి పొద్దులో
చెంగావి చెంగు పూజలో
మందార మలి పొద్దులో
చెంగావి చెంగు పూజలో
పగడాల పక్కమీద పరువాల తోడుపెట్టి
పాలంటి పొంగుమీద పచ్చా కర్పూరమేసి
అందాలు అందిస్తుంటే హోయ్

పెదవింటి సిగ్గులన్ని పొదరింట ముగ్గులేసి
కట్నంలా చేతికొస్తావా...
మరుడికి నరుడికి తెలియనిదిస్తే
వరుడికి వలపుల కానుక తెస్తే


తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డాణమెడతా
పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
నన్నే పెళ్ళాడుతావ కన్నె చిలకా 


2 comments:

మాంచి మాస్ పాట..

బాలయ్య బాబు పాట కదండీ మరి :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.