గురువారం, జూన్ 13, 2019

ఎవరు ఎవరో తెలియకుండా...

బహుదూరపు బాటసారి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బహుదూరపు బాటసారి (1983)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాసరి నారాయణ రావు
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

ఎవరు ఎవరో తెలియకుండా
ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం
చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే...
చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే..
చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం

కన్ను కన్ను కలిసినాక
పిచ్చిపట్టి తిరుగుతుంటె
దాహం.. దాహం.. దాహం
దాహం.. దాహం.. దాహం..
దిక్కులన్నీ పూలు పరచి
పిల్లలల్లే ఎగిరిపడితే...
సరసం.. సరసం.. సరసం..
సరసం.. సరసం.. సరసం..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..

ఎదురు చూసి కనులు రెండూ
తెల్లవారి ఎర్రబారితే..
విరహం... విరహం... విరహం
విరహం... విరహం... విరహం

చనువు పెరిగి అలకలేసి
అలిగి అలిగి పారిపోతే
కలహం.. కలహం... కలహం..
కలహం.. కలహం.. కలహం..
లల్లలల్లలా.. ఆహహా...
ఆహహా... ఓహో.. ఆహహా..

దాహాల చెరువుల్లో..
సరసాల వానల్లో
విరహాలు.. కలహాలు..
కమ్మని ప్రేమకు చిగురులు..

ఎవరు ఎవరో తెలియకుండా..
ఒకరినొకరు కలుసుకొనుట....
చిత్రం.. విచిత్రం..

అడుగులోన అడుగు వేసి..
ఏడడుగులు నడుస్తుంటే..
ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం..
జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం..

ఆరుబయట చందమామ
రారమ్మని పిలుస్తుంటే..
ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం..
పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం..

తారలన్ని తోరణాలై..
తొలి రాతిరి కాపు కాస్తే..
మైకం.. మైకం.. మైకం..
మైకం.. మైకం.. మైకం..
సిగ్గు విడిచి చీకటంతా..
నవ్వి నవ్వి తెల్లవార్చితే...
స్వర్గం.. స్వర్గం..

స్వప్నాల మైకం లో.. 
స్వర్గాల ఊయలలో..
రాగాలు.. భావాలు..
కమ్మని కాపురాన కబురులు...

ఎవరు ఎవరో తెలియకుండా
ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..
చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే..
చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..


2 comments:

రమేష్ నాయుడు గారి పాటలు చాలా మెలోడియస్ గా ఉంటాయి..

నిజమేనండీ నాకూ చాలా ఇష్టమ్ ఆయన పాటలు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.