హిందీపాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిందీపాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, జులై 28, 2018

ప్రేమ తన ధనమాయే...

ప్రేమ లీల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ లీల (2015)
సంగీతం : హిమేష్ రేషమ్మియా 
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : చిన్మయి

సుఖదుఃఖాలు సిరిసంపదలు
అంతా ఓ మాయే
స్వచ్చం మనసూ
లోలోన సదా
ప్రేమ రతనమాయే
ప్రేమ రతనమాయే

మాయో... మాయో.. మాయో..
ఛాయో... హాయో.. రాయో.. మాయో...
హో.. సయ్యాటాడే బాలికా బాబు నీ పదాలకీ
సయ్యాటాడే బాలికా బాబూజీ నీ మాటకీ
సిగ్గు రంగు సోకెరా గులాబీ సుమానికి
 
హాయొరె హాయొరె హాయొరె ప్రేమీ...
హాయొరె హాయొరె హాయొరె ప్రేమీ...
హాయొరె హాయొరె హాయొరె ప్రేమా.. రే..

  
ప్రేమ తన ధనమాయే ఆయే
ప్రేమ తన ధనమాయే ఆయే
వ్రతము ఇది నిజమాయే
ప్రేమ తన..
ప్రేమ తన ధనమాయే మైనా..
ప్రేమ తన ధనమాయే...


చూపేది కాదూ దాచేది కాదూ
శోభనమే మనమే
ఈ విధి తాను పలికేను నేను
సరిగమలీ క్షణమే
కులికేను ఈ వనమే
సెగ రేపె యామిని
రగిలే సుఖాలకీ
సిగ్గురంగు సోకెరా
గులాబీ సుమానికి

హాయొరె హాయొరె హాయొరె ప్రేమీ...
హాయొరె హాయొరె హాయొరె ప్రేమీ...
హాయొరె హాయొరె హాయొరె ప్రేమా.. రే..


ప్రేమ తన ధనమాయే ఆయే  
ప్రేమ తన ధనమాయే ఆయే
ఆశలివి బరువాయే.. 
ప్రేమ తన..
ప్రేమ తన ధనమాయే మైనా..
ప్రేమ తన ధనమాయే... 

శుక్రవారం, జులై 27, 2018

బాటసారి బాటసారి...

రాజా హిందూస్తానీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజా హిందుస్తానీ (1996)
సంగీతం : నదీమ్ శ్రవణ్
సాహిత్యం :
గానం : బాలు, చిత్ర

ఓ పయనించే చిలుకా
నీ బాట మారిందే
ఎదే అర్పించిన గోరింకా
మాట నీకు గుర్తుందా

బాటసారి బాటసారి నన్నే విడీ
బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్..
బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్..
పరిచింది బతుకే నీకై వలచేటి మనసే
ముక్కలైన ఎదనే రాలిపోయింది ఆశే


బాటసారి బాటసారి నన్నే విడీ
బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్..
పరిచింది బతుకే నీకై వలచేటి మనసే
ముక్కలైన ఎదనే రాలిపోయింది ఆశే

బాటసారి బాటసారి నన్నే విడీ
బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్..

ప్రాణం నువ్వై ధ్యానం నువ్వై బతికానే
కమ్మని వలపే నీ తలపై వేచానే
ప్రాణం నువ్వై ధ్యానం నువ్వై బతికానే
కమ్మని వలపే నీ తలపై వేచానే
నీ మదిలోన తియ్యని గుర్తుగ ఉంటాలే
నీ కోసం వేయి జన్మలు కాచుకుంటాలే 

 
పరిచింది బతుకే నీకై వలచేటి మనసే
ముక్కలైన ఎదనే రాలిపోయింది ఆశే

బాటసారి బాటసారి నన్నే విడీ నువ్వు నన్నే విడీ
బాటసారి బాటసారి నన్నే విడీ ఏయ్ నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్.. పోరాదోయ్ పోరాదోయ్..


మరువకు నన్నే.. మరువకు నన్నే..
మరువకు నన్నే ఓఓఓఓ..

ఆమని పాటే శిశిరం ఐ ఎద పగిలిందీ
పగిలిన ఎద కన్నీటి చెమ్మగా రగిలిందీ
ఆమని పాటే శిశిరం ఐ ఎద పగిలిందీ
పగిలిన ఎద కన్నీటి చెమ్మగా రగిలిందీ
గుండెను నాకే అర్పించి నువ్ వెళ్తున్నా
ఏనాడు నా జ్ఞాపకం మిగిలుంటుంది

పరచానే బతుకే నీకై మౌనంగ నేనే
నువ్వులేని ఎదనే రాలిపోయింది ఆశే 

 
బాటసారి బాటసారి నన్నే విడీ
బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్..

పరిచింది బతుకే నీకై వలచేటి మనసే
ముక్కలైన ఎదనే రాలిపోయింది ఆశే

బాటసారి బాటసారి నన్నే విడీ 

పోరాదోయ్ పోరాదోయ్..

బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్.. 

 
పరిచింది బతుకే నీకై
ఓఓఓఓఓ వలచేటి మనసే
పరిచింది బతుకే నీకై
ఓఓఓఓఓ వలచేటి మనసే
ముక్కలైన ఎదనే రాలిపోయింది ఆశే

బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్..
బాటసారి బాటసారి నన్నే విడీ
పోరాదోయ్ పోరాదోయ్..  


సోమవారం, జులై 23, 2018

నిన్నెవరింక ప్రేమిస్తారు...

ఎమ్మెస్ ధోనీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధోనీ (2016)
సంగీతం : అమాల్ మల్లిక్ 
సాహిత్యం : చైతన్య ప్రసాద్ 
గానం : పలక్ ముఛ్చల్

గురుతొస్తావు నువ్విపుడూ
గుస గుస ఊపిరి తీస్తుంటే
నీ ఎద వీధిలో ప్రతి రోజు
నే సరదాగ నడుస్తుంటే
తూఫాను గాలై వెళుతుంటా
నే ధూళి కణమై వీస్తుంటే

నిన్నెవరింక ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే

నా చూపిలా సాగుతూ
నీ చెంత ఆగిందిలే
చెప్పేందుకేముందిక
చెప్పేశాక శూన్యమే
నా చూపులేనాడూ
నీ కోసమే చూడు
కంటి కబుర్లే చెరేనె
నే చదివాను మౌనంగా
నీ కన్నుల్లో భావాలు

నిన్నెవరింక ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే

నాతో నువ్వే ఉండగా
స్వప్నాలన్నీ తడబడే
చేజారె ఈ క్షణములే
ఆ గాలిలో తేలెలే
నా నవ్వు నీ వల్లే
నా జీవం నీ వల్లే
కంటి కబుర్లె చేరేనే
ఎపుడైనా నిను చూడనిదే
పిచ్చే పట్టీ తిరిగేను

నిన్నెవరింక ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే


బుధవారం, జులై 18, 2018

నాట్యమే నాకు ఊపిరి...

నాచ్ చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాచ్ (1995)
సంగీతం : అమర్ మోహ్లీ
సాహిత్యం :
గానం :

నాట్యమే నాకు ఊపిరి
నాట్యమే నాకు సర్వం
కలనైనా మరి ఇలనైనా
నాట్యమే నాకు లోకం


మనసంత నిండిపోయే
తనువున ఉండిపోయే డాన్స్
నరనరము హత్తుకుపోయి
నాలో కరిగిపోయే డాన్స్

నాకు తోడుగా నాకు నీడగా
నాకు తోడుగా నాకు నీడగా
అణువణువున లే మిళితం
అడుగడుగున లే మిళితం డాన్స్


పెదవుల కదలికలోనా
పాదముల గుసగుసలోనా డాన్స్
ప్రవహించే రక్తంలోనా
గుండెలోని సవ్వడిలోనా డాన్స్

నాకు తోడుగా నాకు నీడగా
నాకు తోడుగా నాకు నీడగా
కలలో కవ్వించేదీ నవ్వించేదీ డాన్స్  


సోమవారం, జులై 16, 2018

చల్ ఛయ్య ఛయ్య...

ప్రేమతో (దిల్ సే) చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమతో (దిల్ సే) (1998)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్  
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : ఏ.ఆర్.రహ్మాన్, సౌమ్య రావ్,
డామ్నిక్, కవిత పౌడ్వాల్

ఎంత అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మాని
ఎంత అలకే కిన్నెరసాని


చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికేయ 
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా


చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా


తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
 

తొలగేన మరీ ఈ మాయ తెరా
తన చెలిమి సిరీ నా కలిమి అనీ
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి


జాలిపడైనా ఓయ్ అనదే
మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై
నా వైపే వస్తూ ఉన్నదయా

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య 
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
  చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా
పరువాల తరంగమే తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా 


 ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
చెప్పరయ్య నా జాణ తోటి
తన కంటపడే దారేదయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
(4)

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య 
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(4) 

 
ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

శనివారం, జులై 14, 2018

మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే...

ప్రేమించి పెళ్ళాడుతా (దిల్వాలే దుల్హనియా లేజాయేంగే) చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : ప్రేమించి పెళ్ళాడుతా (1997) 
(దిల్వాలే దుల్హనియా లేజాయేంగే)
సంగీతం : జతిన్ లలిత్  
సాహిత్యం : వెన్నెలకంటి 
గానం : చిత్ర 

మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే
మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే
వచ్చీ ఏవో చెప్పి తప్పుకుంటున్నాడే

మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే
వచ్చీ ఏవో చెప్పి తప్పుకుంటున్నాడే
మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే


తానెక్కడుంటాడో నాకే తెలీదే
ఓ తానెక్కడుంటాడో నాకే తెలీదే
కాజేసే నా మది ఓ చూపుతోటీ
కమ్మంగా జంటే కట్టాడమ్మో
చల్లంగ గుండెల్లో చేరాడమ్మో
చూసే ఓర ఓరగా సోకే దోర దోరగా
చూసి అయ్యో మరి నిద్దరే దోచాడే

మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే
వచ్చీ ఏవో చెప్పి తప్పుకుంటున్నాడే
మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే


కల్లోనా నన్నే చూసి కనుగీటినాడే
ఓ కల్లోనా నన్నే చూసి కనుగీటినాడే
మాటాడుతూ తలపే కాజేసినాడే
నువ్వే నా ప్రేయసి అన్నాడమ్మో
కవ్వించే గారాల చిన్నోడమ్మో
కమ్మంగా మోజుతో కరిగించే ఫోజుతో
మనసే గిల్లేశాడే మాయజేసినాడే

మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే
మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే
వచ్చీ ఏదో చెప్పి తప్పుకుంటున్నాడే
లాల్ల...లాలలాలలాల్లా...
లాల్ల...లాలలాలలాల్లా... 
 

బుధవారం, జులై 11, 2018

ఊహించలే ఊహించలే...

ధూమ్ త్రీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధూమ్-3 (2013)
సంగీతం : ప్రీతమ్ చక్రబొర్తి   
సాహిత్యం : భాస్కరభట్ల  
గానం : మోహిత్ చౌహాన్

ఓ చెలీ నీ చూపులో నేను ఉదయించా
ఓ చెలీ చిరునవ్వులో నన్ను వెలిగించా

ఓ చెలీ నీ చూపులో నేను ఉదయించా
ఓ చెలీ చిరునవ్వులో నన్ను వెలిగించా

నువ్వు వెళ్ళే దారిలో మనసు పారేశా
నావలా నీ ప్రేమలో మునిగిపోతున్నా

ఊహించలే ఊహించలే ఓ నిజం
ఊహించలే ఊహించలే


రావే చూడే ఇలాగే కునుకే చెడిందే కనులకే
అమ్మో చెపితే వినాలె కుదురే చెడిందే వయసుకే
బ్రహ్మ వేసిన బాణమై దూసుకొచ్చేశావ్
తీయగా నా ఊపిరే తీసుకెళ్తున్నావ్
కన్నె సొగసు కత్తికే నన్ను గుచ్చేశావ్
ప్రాణమే ఇస్తానులే అంత నచ్చేశావ్..

ఊహించలే ఊహించలే ఓ నిజం
ఊహించలే ఊహించలే


ఆశపోదులే నీధ్యాసలో చేరి
చంపినా సరే నవ్వేస్తూ ఉంటానే
ప్రేమలా ఇలా నీ శ్వాస తాకితే
జీవితానికే అది చాలు అంటదే
రకరకాల కలకలం తలపులో రేపావ్
అందమే తావీజులా మహిమ చూపించావ్

నువ్వు వెళ్ళే దారిలో మనసు పారేశా
నావలా నీ ప్రేమలో మునిగిపోతున్నా

ఊహించలే ఊహించలే ఓ నిజం
ఊహించలే ఊహించలే
ఊహించలే ఊహించలే ఓ నిజం
ఊహించలే ఊహించలే 


ఆదివారం, జులై 08, 2018

ఏదో తెలియని ఆవేదనే...

దంగల్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దంగల్ (యుద్ధం) (2016)
సంగీతం : ప్రీతమ్
సాహిత్యం : రాజశ్రీ సుధాకర్
గానం :

ఏదో తెలియని ఆవేదనే నన్నే ఆవహించే
గుండెను మంటలు రేగగా నన్నే దహించే
ఎందుకో నాకళ్ళు నేడు చెమ్మగిల్లేనెందుకో
అవి కాంతిలేక వాడెనెందుకో
ఎందుకో నా కంటి పాప కన్ను వీడెనెందుకో
నా గుండె గూడు చిన్నబోయేనో

ఇలా ప్రతీ క్షణం నిరీక్షణై
దగా చేస్తూ బంధాలు భారం ఐతే
అవి దారులే మారుతుంటే తాళగలనా
నా మనసు నేడు కుమిలి పోయెనెందుకో
సుఖాల నావ మునిగెనెందుకో


శ్వాసలో శ్వాసగా ఆశలో ఆశగా
కలవరించే మమతలెన్నో ప్రాణమై ఉండగా
ఎందుకీ వేదనా ఎందుకీ యాతనా
రేగెనే రేయి పగలూ గుండెలో రోదనా
ఎందుకో ఆనింగిలోన ఉన్న కోటి తారలే
గ్రహణాలు తాకి నేల రాలేనో
ఎందుకో ఇలా అగ్ని జ్వాల
చిలకరించు కన్నులే
ఇక నీరసించి నీడ వెతికేనో

ఇలా ప్రతీ క్షణం నిరీక్షణై
దగా చేస్తూ బంధాలు భారం ఐతే
అవి దారులే మారుతుంటే తాళగలనా
నా మనసు నేడు కుమిలి పోయెనెందుకో
సుఖాల నావ మునిగెనెందుకో
 

మంగళవారం, జులై 03, 2018

ఏ ఊహలోనో...

శివ 2006 చిత్రంలోని ఒక మంచి మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శివ 2006 (2006)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం: శ్రేయా ఘోషల్ , విజయ్ ప్రకాష్

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో
మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో
మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో

నీలాల నీకళ్ళ లోతుల్లో మునిగాక తేలేదెలాగో మరి
వేవేల వర్ణాల తారల్ని తాకందే ఆగేనా ఈ అల్లరీ
ప్రియమైన బంధం బిగించే వేళలో
జతలోన అందం తరించే లీలలో
ఈ నేల పొంగి ఆ నింగి వంగి
హద్దేమి లేనట్టు ముద్దాడుకున్నట్టు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

నీలో నాలో ..ఆ .. ఆ
నీలో నాలో తరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం
నీలో నాలో తరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం

అణువు అణువు నిలువెల్ల రగిలించి కరిగించు కౌగిళ్ళలో
తాపాల దీపాలు వెలిగించి వెతకాలి నాలోని నువ్వెక్కడో
ఏ సూర్యుడో మనని లేపే లోపుగా
ఈ లోకమే మరచి పోదాం కైపుగా
ఏ కంటిచూపు ఈ జంట వైపు రాలేని
చోటేదో రమ్మంది లెమ్మంటు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో..
నా కళ్ళలో
మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో..
ఇన్నాళ్ళలో
లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో
మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

సోమవారం, జులై 02, 2018

నాలో ఉత్సాహమే...

ఏబిసిడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఏబిసిడి (2013)
సంగీతం : సచిన్ జిగర్
రచన : భువనచంద్ర
గానం : కార్తీక్, వీణ
Rap : Tanvi Shah, Deane Segueira

నాలో ఉత్సాహమే ఉప్పొంగెనో
నాలోన ధైర్యమే చెలరేగెనో
స్వప్నాల సౌథమే నన్నూరించెనో

మౌనమే ఎదలో పుట్టెనా
బాధలో మనసే మునిగెనా 

మౌనమే ఎదలో పుట్టెనా
బాధలో మనసే మునిగెనా

No pains, no fear, no shouts, no tears
I wanna make my life lot peaceful and clear
Me, You, who wanna live here
So just let me breathe

మౌనమే ఎదలో పుట్టెనా
బాధలో మనసే మునిగెనా

మౌనమే ఎదలో పుట్టెనా
బాధలో మనసే మునిగెనా
  
కలలలోన నీ నేస్తాన్నీ
నాలో ఉన్న నీ భాగాన్నీ
నను వీడిపోతే ఎలా

Can anybody tell on me?
NO! NO!
You better not stop me
You better not flop me
From who I wanna be
It's my destiny
Don't Mr. Stinner
Here come the winner
Play on the bass up in the race

No pains, no fear, no shouts, no tears
I wanna make my life lot peaceful and clear
Me, You, who wanna live here
So just let me breathe

Kaka Boom... Kaka Boom... Kaka Boom
Ho...Ya!
Ho...Ya! Ho...Ya!

మౌనమే ఎదలో పుట్టెనా
బాధలో మనసే మునిగెనా

కలలలోన నీ నేస్తాన్నీ
నాలో ఉన్న నీ భాగాన్నీ
నను వీడిపోతే ఎలా

Hey hey...
Kaka Boom... Kaka Boom... Kaka Boom

మౌనమే ఎదలో పుట్టెనా
బాధలో మనసే మునిగెనా

మౌనమే ఎదలో పుట్టెనా
బాధలో మనసే మునిగెనా


ఆదివారం, జులై 01, 2018

గుండె ఆడినా...

ఆనాటి సినిమాలలోని నృత్యరూపకాల సిరీస్ ని నిన్నటితో ముగించి ఈ నెల ఒక సరికొత్త సిరీస్ మొదలు పెడుతున్నాను. ఈ సిరీస్ ఏవిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ పాట చూస్తే మీరు ఇట్టే పట్టేయగలరు అనుకుంటున్నాను. ముందుగా క్రిష్ చిత్రంలోని ఒక హుషారైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : క్రిష్ (2006)
సంగీతం : రాజేష్ రోషన్
రచన : రాజశ్రీ సుధాకర్
గానం : కునాల్ గాంజావాలా

గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా


నువ్వు చంద్రుడిపై కాలు పెట్టినావట
విశ్వాన్నే గెలిచావటా
కనుశోకంతో కుమిలే వాడ్ని
ఒకసారైన నవ్వించగలవా

ఆ పై వాడు ఈ విషయాన్ని
అడగక మానడు ఓ రోజు

గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా


ఈ జీవితమే ఓ సర్కసు రా
గమ్మత్తులు తప్పవు చూడరా
నువు ప్రేమిస్తే సుఖజీవనము
లేదా కథ కంచికి చేరునురా
పరమార్ధం ఇంతేరా
తెలుసుకుంటే మంచిదిరా

గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా 

 

సోమవారం, మార్చి 17, 2014

హోలీ శుభాకాంక్షలు..

ఇళయరాజా గారి అద్భుతమైన మ్యూజికల్ హిట్ "అభినందన" సినిమాలోని ఈ కలర్ ఫుల్ పాట హోలీ సందర్బంగా మీకోసం. హోలీ అనగానే ఉన్న నాలుగైదు పండగకి సంబంధించిన పాటలనే రొటీన్ గా షేర్ చేసుకునే బదులు రంగులమయమైన ఈ పాట షేర్ చేద్దామనిపించింది చూసి ఆనందించండి.

మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు.. 
 సహజసిద్దమైన రంగులు వాడడానికి ప్రయత్నించండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి

ఆఆఆఅ..ఆఆఆ.ఆఅ 
మ్.హుహు..ఊహూహూహు..
మ్.హుహు..ఊహూహూహు..
ఊహు..మ్ఊఊ.. ఊహు.. ఊహూహూ..
ఆఆఅ.ఆఅ..ఆ.. లాలలాలలాల.. 

రంగులలో కలవో యద పొంగులలో కళవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో

కాశ్మీర నందన సుందరివో.. 
కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో.. ఆఆ
ఆమని పూచే యామినివో..ఆఅ
మరుని బాణమో.. ఆహా మదుమాస గానమో ఆహ్హా..
నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై.. యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై 
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై...


ముంతాజు అందాల అద్దానివో.. 
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో.. ఆఅ
లైలా కన్నుల ప్రేయసివో.. ఆఅ
ప్రణయ దీపమో.. ఆహా నా విరహ తాపమో.. ఆహా
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో

రంగులలో కలనై లలలా లలలా 
యద పొంగులలో కళనై లలలా లలలా
నవశిల్పాంగినై రతిరూపాంగినై 
నీ ఊహల ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

హోలీ ఎంతైనా నార్త్ ఇండియాలో ఎక్కువ జరుపుకునే పండగ కదా కనీసం ఇపుడైనా ఒక హిందీ పాట పంచుకోకపోతే ఎలా అందుకే హోలీ పాటలలో ఆకట్టుకునే ఈ శాంతారామ్ గారి పాట చూడండి 'నవరంగ్' సినిమాలోనిది ఎంత బాగుందో.. ఈ పాట వినాలంటే ఇక్కడ వినవచ్చు.



Movie/Album: नवरंग (1959)
Music By: सी.रामचंद्र
Lyrics By: भरत व्यास
Performed By: चितलकर, महेंद्र कपूर, आशा भोंसले

अटक-अटक झटपट पनघट परचटक मटक इक नार नवेली
गोरी-गोरी ग्वालन की छोरी चली
चोरी चोरी मुख मोरी मोरी मुसकाये अलबेली
कँकरी गले में मारी कंकरी कन्हैये ने
पकरी बाँह और की अटखेली
भरी पिचकारी मारी
भोली पनिहारी बोली

अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे
 
अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे

 मुझे समझो न तुम भोली भाली रे

आया होली का त्योहारउड़े रंग की बौछार
तू है नार नखरेदार मतवाली रे
आज मीठी लगे है तेरी गाली रे

तक तक ना मार पिचकारी की धार
..
तक तक ना मार पिचकारी की धार
कोमल बदन सह सके ना ये मार
तू है अनाड़ी, बड़ा ही गँवार
कजरे में तूने अबीर दिया डार
तेरी झकझोरी से, बाज़ आयी होरी से
चोर तेरी चोरी निराली रे
मुझे समझो ना तुम भोली भाली रे
 
अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे
मुझे समझो न तुम भोली भाली रे

धरती है लाल आज, अम्बर है लाल  
धरती है लाल आज, अम्बर है लाल 
उड़ने दे गोरी गालों का गुलाल
मत लाज का आज घूँघट निकाल
दे दिल की धड़कन पे, धिनक धिनक ताल
झाँझ बजे शँख बजे, संग में मृदंग बजे
अंग में उमंग खुशियाली रे
आज मीठी लगे है तेरी गाली रे
 

अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे 

मुझे समझो न तुम भोली भाली रे

హోలీ శుభాకాంక్షలు
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే చివరిగా ఈ వీడియో ఒకటి చూడండి ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటూ అమెరికాలో జరుపుకుంటున్న హోలీని చాలా చక్కగా ప్రజంట్ చేశారు. ఒక్కసారిగా రంగులు గాలిలోకి ఎగరడం చిత్రీకరించిన విధానం నాకు చాలా నచ్చింది అంతేకాక ఈ ఫెస్టివల్ లో ఉపయోగించేవి అన్నీ సహజ సిద్దమైన రంగులట. 



గురువారం, ఫిబ్రవరి 14, 2013

करिये ना - Taal (1999)

సంగీతానికి భాషాపరిమితులు లేవన్నది సత్యం. భాషకతీతంగా కొన్ని పాటలు సంగీతంతోనే మన మనసులో చెరగని ముద్ర వేసేస్తాయి, అలాంటి పాటలలో రహ్మాన్ కంపోజిషన్స్ ముందు ఉండేవి అని చెప్పచ్చేమో. ఈ పాటకు అర్ధం తెలియని నా మిత్రులు సైతం పదే పదే వినడం పాడడానికి ప్రయత్నించడం నేను గమనించాను, నిజానికి తాళ్ లో చాలా పాటలు అలాగే అద్భుతమైన సంగీతంతో ఆకట్టుకుంటాయి. ఈమధ్య పాటలు వినడం మళ్ళీ మొదలెట్టాను కదా చాలా రోజుల తర్వాత విన్న పాట ఇది, నాకు చాలా ఇష్టం. అన్నట్లు ఇప్పటివరకూ ఈ బ్లాగ్ లొ హిందీ పాటలు పోస్ట్ చేసినట్లు లేను కదా. సాథారణంగా నేను తెలుగు తో పాటు హిందీ ఇంగ్లీష్ తమిళ్ పాటలు కూడా వింటూంటాను. సో వీలు చూస్కుని అపుడపుడు ఆయాభాషా గీతాలను కూడా మీతో పంచుకుంటాను. 

ఎలాగూ ప్రేమికులదినోత్సవం కూడా కనుక పనిలో పనిగా ప్రేమికులకు వినిపిద్దామని ఇపుడీపాట పోస్ట్ చేస్తున్నాను, కానీ రెండుచేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు ప్రేమలో ఇద్దరి కంట్రిబ్యూషన్ ముఖ్యం కనుక మీరొక్కరు వింటే కొంచమే లాభం సో మీ మీ పార్టనర్స్ ని కూడా పక్కన కూర్చోపెట్టుకుని వినండి.. ప్రామిస్ చేసి బ్రేక్ చేయడం మన సంప్రదాయం కాదని మరోసారి నొక్కిచెప్పండి :-) ప్రామిస్సులు గుర్తుచేస్కోమన్నాను కదా అని పట్టుచీరలో వడ్డాణాల ప్రామిస్ లో గుర్తుచేస్కుంటే కష్టం మరి :-) 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


Film: Taal
Music Director: A R Rahman
Lyricist: Anand Bakshi
Singer(s): Sukhvindar Singh,  Alka Yagnik

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा
यारा यारा यारा हो

करिये ना हाँ करिये ना कोई वादा किसी से करिये ना
करिये करिये हो करिये करिये तो वादा फिर तोड़िये ना

हाथ किसी का पकड़िये ना 
पकड़िये तो फिर छोड़िये ना

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा
यारा यारा यारा हो

मैनूँ खिच पैंदी ए
सीने विच पैंदी ए
ओ मैंनूँ कुछ हो गया दुनिया कैंदी ए

ओ इस कुछ का नाम जवानी है ये उम्र बदि दीवानी है
तूम तननना तूम तननना तूम तननना ननना ना
सच्चे सब सपने लगते हैं बेगाने अपने लगते हैं
अपनों से मुँह मोड़िये ना सपनों के पीछे दौड़िये ना

करिये ना हाँ करिये ना कोई वादा किसी से करिये ना
करिये करिये हो करिये करिये तो वादा फिर तोड़िये ना


ऐना बदला दे नाल मैं जुड़ जावाँ
बन जावाँ पतंग मैं उड़ जावाँ

कोई परदेसी आवेगा तेरी डोली ले जावेगा
मैं सारी रसमें तोड़ूँगी बाबुल का घर नहीँ छोड़ूँगी
तक़दीरों का मुँह खोलिये ना 
चुप रहिये बस कुछ बोलिये ना 

करिये ना हाँ करिये ना कोई वादा किसी से करिये ना
करिये करिये हो करिये करिये तो वादा फिर तोड़िये ना

हाथ किसी का पकड़िये ना 
पकड़िये तो फिर छोड़िये ना

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा
यारा यारा यारा हो

For lyrics in other scripts visit here.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.