ఆదివారం, జులై 01, 2018

గుండె ఆడినా...

ఆనాటి సినిమాలలోని నృత్యరూపకాల సిరీస్ ని నిన్నటితో ముగించి ఈ నెల ఒక సరికొత్త సిరీస్ మొదలు పెడుతున్నాను. ఈ సిరీస్ ఏవిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ పాట చూస్తే మీరు ఇట్టే పట్టేయగలరు అనుకుంటున్నాను. ముందుగా క్రిష్ చిత్రంలోని ఒక హుషారైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : క్రిష్ (2006)
సంగీతం : రాజేష్ రోషన్
రచన : రాజశ్రీ సుధాకర్
గానం : కునాల్ గాంజావాలా

గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా


నువ్వు చంద్రుడిపై కాలు పెట్టినావట
విశ్వాన్నే గెలిచావటా
కనుశోకంతో కుమిలే వాడ్ని
ఒకసారైన నవ్వించగలవా

ఆ పై వాడు ఈ విషయాన్ని
అడగక మానడు ఓ రోజు

గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా


ఈ జీవితమే ఓ సర్కసు రా
గమ్మత్తులు తప్పవు చూడరా
నువు ప్రేమిస్తే సుఖజీవనము
లేదా కథ కంచికి చేరునురా
పరమార్ధం ఇంతేరా
తెలుసుకుంటే మంచిదిరా

గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
గుండె ఆడినా గుండె ఆగినా
ఆది ప్రేమ కోసమే లేరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా
సాటివాడినీ ప్రేమించకుంటే
బ్రతికుండి లాభం ఏంటిరా 

 

2 comments:

హృతిక్ రోషన్ ..మై ఫావెరెట్ హీరో..థాంక్ యు ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. హృతిక్ నచ్చనివాళ్ళేవరుంటారులెండి :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.