మంగళవారం, జులై 10, 2018

వినవే యశోదా...

ప్రేమానురాగం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమానురాగం (హమ్ సాథ్ సాథ్ హై) (1999)
సంగీతం : రామ్ లక్ష్మన్   
సాహిత్యం : వెన్నెలకంటి  
గానం : చిత్ర 

వినవే యశోదా.. నీ చిన్నీ కన్నయ్యా..
వినవే యశోదా నీ చిన్నీ కన్నయ్యా
చల్లలమ్మబోతే మధురా పురానా
విరిపొదలో దాగాడే నా పైటా లాగాడే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా

వినవే యశోదా నీ చిన్నీ కన్నయ్యా
చల్లలమ్మబోతే మధురా పురానా
విరిపొదలో దాగాడే నా పైటా లాగాడే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
హో.. రాలుగాయీ గోపయ్యా..

గోకులాన వీధుల్లో యమునా తీరానా
ఓ మూల దాగుండి చిలిపిగా రాళ్ళేసి
కన్నెఎదలు వెన్నల్లే దోచేసిన దొంగా
హోలీ రంగులతో నను తడిపే చల్లంగా
వాణ్ణీ వదలొద్దే కథలేవీ వినవద్దే
వాణ్ణీ వదలొద్దే కథలేవీ వినవద్దే
వెంటపడీ వలపే పంచేయ్ అన్నాడే
మంచి మంచి మాటలతో వలలో వేశాడే హాయ్

రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా..

గోపాల బాలుని మోహన మొరళికే
సిరిమువ్వలే మోగే మనసే పులకించి
కన్నులతో రమ్మంటూ కవ్వించే వేళా
నా తలపే తెర తీసే ప్రేమే ఈవ్వాళా
విరహాన వేగీ నిదరే రాకుందీ
విరహాన వేగీ నిదరే రాకుందీ
నను నేనే మరిచీ నే కూర్చున్న వేళ
బాలగోపాలుడికై హృదయం వేచేనే

రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా..

గుండెల్లో కొలువుండే స్వామీ గోపయ్యా
పతి దేవుడై నాకు దొరికే కృష్ణయ్యా
గోవిందుడెపుడూ అందరివాడమ్మా
లోకాల పాలుడు నీ బాలుడమ్మా
పతిగా మాధవునీ నువ్వే ఇచ్చిందీ
పతిగా మాధవునీ నువ్వే ఇచ్చిందీ
మమతానురాగంనీ నువ్వే పంచింది
నీ పదమే ఏనాడూ మా దైవ సన్నిధిలే..

రాలుగాయీ గోపయ్యా దేవుడే
రాలుగాయీ గోపయ్యా దేవుడే
రాలుగాయీ గోపయ్యా.

2 comments:

రాజశ్రీ వాళ్ళ మూవీస్ ముఖ్యం గా సల్మాన్ ఖాన్ ఉన్నవి చూస్తే ఓ చక్కని పెళ్ళిపందిరిలో గడిపి వచ్చినట్టుంటుంది మాకు..

హహహ ఒక్క ముక్కలో చెప్పేశారండీ.. నిజమే.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.