ఆదివారం, జులై 08, 2018

ఏదో తెలియని ఆవేదనే...

దంగల్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దంగల్ (యుద్ధం) (2016)
సంగీతం : ప్రీతమ్
సాహిత్యం : రాజశ్రీ సుధాకర్
గానం :

ఏదో తెలియని ఆవేదనే నన్నే ఆవహించే
గుండెను మంటలు రేగగా నన్నే దహించే
ఎందుకో నాకళ్ళు నేడు చెమ్మగిల్లేనెందుకో
అవి కాంతిలేక వాడెనెందుకో
ఎందుకో నా కంటి పాప కన్ను వీడెనెందుకో
నా గుండె గూడు చిన్నబోయేనో

ఇలా ప్రతీ క్షణం నిరీక్షణై
దగా చేస్తూ బంధాలు భారం ఐతే
అవి దారులే మారుతుంటే తాళగలనా
నా మనసు నేడు కుమిలి పోయెనెందుకో
సుఖాల నావ మునిగెనెందుకో


శ్వాసలో శ్వాసగా ఆశలో ఆశగా
కలవరించే మమతలెన్నో ప్రాణమై ఉండగా
ఎందుకీ వేదనా ఎందుకీ యాతనా
రేగెనే రేయి పగలూ గుండెలో రోదనా
ఎందుకో ఆనింగిలోన ఉన్న కోటి తారలే
గ్రహణాలు తాకి నేల రాలేనో
ఎందుకో ఇలా అగ్ని జ్వాల
చిలకరించు కన్నులే
ఇక నీరసించి నీడ వెతికేనో

ఇలా ప్రతీ క్షణం నిరీక్షణై
దగా చేస్తూ బంధాలు భారం ఐతే
అవి దారులే మారుతుంటే తాళగలనా
నా మనసు నేడు కుమిలి పోయెనెందుకో
సుఖాల నావ మునిగెనెందుకో
 

2 comments:

వెరీ వెరీ ఇన్స్పైరింగ్ మూవీ..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.