మంగళవారం, జులై 24, 2018

కదిలిపోయే మేఘమా...

కొండవీటి సింహం (ఖుదాగవా) చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కొండవీటి సింహం (1994)
సంగీతం : లక్ష్మీకాంత్ ప్యారేలాల్
సాహిత్యం : గురుచరణ్
గానం : చిత్ర, బాలు

ఓఓఓఓఓఓ....ఓఓఓఓఓఓ..
కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు


నవాబు జీవితం
గులాము కానిదీ
కలత ఎందుకు తోడుగా
తిరిగి వస్తా నీడగా

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కలిసి రాద కాలమూ
ఎదురు తెన్నులు చూడగా
నా దైవం నీవై చేరగా

కలిసి రాద కాలమూ
ఎదురు తెన్నులు చూడగా
నా దైవం నీవై చేరగా


ఎడారీ ఆశకూ కలేగా తీరము
నా ప్రాణమే ఏమై పోయినా
నీ ఒడిని ప్రేమై చేరనా

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోతె మేఘమూ
వెన్నెలే వేడౌతది
నా గుండె బరువే అవుతది


వియోగం నీదిగా
విషాదం నాదిగా
బాధ కూడా తీయగా
మలచుకోవే ఓ సఖీ

నా మది పిలుపందుకో
చెరి సగం పంచేసుకో
విరహమే కలిగించకూ

నా మది పిలుపందుకో
చెరి సగం పంచేసుకో
విరహమే కలిగించకూ

 
ఇలా ఎడబాటులో
గీతలేని బొమ్మగా
నీదు రెప్పల చాటుగా
పొదిగి నన్నూ దాచుకో

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు


నవాబు జీవితం
గులాము కానిదీ
కలత ఎందుకు తోడుగా
తిరిగి వస్తా నీడగా 

4 comments:

శ్రీదేవి గారి ని తెర మీద ఎంత సేపు చూస్తున్నా చూస్తునె ఉండాలనిపిస్తూంది..
నైస్ మ్యూజిక్...ఒరిజినల్ హిందీ లోని భావమే ఇంకా బావుందేమో...

ఖుదాగవా లో శ్రీదేవి రెండు రోల్స్ లోనూ అద్భుతం గా ఉంటుంది..తెలుగులో ఇదే ట్యూన్ లో పున్నాగ పూల తోటలో అనే పాటుంది..పచ్చని సంసారం మూవీలో..
https://www.youtube.com/watch?v=kuwP6HOER_Q

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

హిందీ సినీకవులు బాగా రాస్తారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ రాజ్యలక్ష్మి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.