బలం (కాబిల్) చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బలం (కాబిల్) (2017)
సంగీతం : రాజేష్ రోషన్
సాహిత్యం : రాజశ్రీ సుధాకర్
గానం : రాహుల్ నంబియార్, వందన శ్రీనివాసన్
నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నయగారమ
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమ
మదిని దోచిన నయగారమ
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలోనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచేనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
సరదాలతో సందళ్ళతొ ఈ లోకమే మరిచేములే
ఓ...అనురాగమే అనుబంధమై మన జీవితం సాగాలిలే
నా గుండెలో నీ కోసమే నునువెచ్చని చోటుందిలే
నాలో నీవు నీలో నేను కొలువుందాములే
నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నవ రాగమా
స్వప్నాలలో ఏముందిలే దోసిలిలోనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనే
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
ఏనాడు చేసిన పుణ్యమో నిజమైనదే నేడు నా కల
నే కోరుకున్న నా దైవమూ నా తోడుగా నడిచేనిలా
తన వన్నెలే సిరి వెన్నెలై నా కోసమే వెలిసిందిలా
ఎన్నడు వీడని జంటై మేము కలిసుంటామిలా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నయగారమా
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
2 comments:
ఈ మూవీ చూసినపుడు ఇలాంటి మృగాలు మనుషుల ముసుగుతో మనతో పాటే ఉంటాయి అనుకుంటే భయమేసిందండి..హృతికి ఆల్వేస్ రాక్స్..
ఓహ్ అవునా ఈ సినిమా నేను చూడలేదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.