మంగళవారం, జులై 31, 2018

కావులే కావులే...

విలన్ (రావణ్) చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విలన్ (రావణ్) (2010)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్     
సాహిత్యం : వేటూరి   
గానం : అంకిత 

కావులే కావులే... కల్లలే కావులే
కాపురం నీదెలే కాగడా వెలుగుల్లో..
నా కాళ్ళ లోతుల్లో కథే వుంది కన్నుల్లో..
 
నీపై వాలి నీపై సోలి యేవో కన్నె నిదరోదు
హితుడ స్నేహితుడా సహమైపోయా...
సఖా మరిచావా.. వారం వారం ఎదిగే అందం
ఈడు జోడు జత కోరు సుఖమేలే సుఖమే
నేనే ఇక నువ్వై కలిసిన మేలు..

నా ఆశా నా శ్వాశా నే చెప్పాలా..
ఆశిస్తే నేన్ చెప్పాలా నా ఆశ
నీలో వింటే కన్నారా సయ్యంటాలే...
అధరాలు విడిపోతుంటే అటు నా
ఎదపోతుంటే నా ప్రియా ఏలుకోవేలా
వలపులో సుడులన్నిఒడుపుగా ఒత్తడం
తెలుగింటి కధయే కదా..ఆ..
వయసులో సుడులెన్నో మనస్సుగా మార్చడం
తమరికి తెలియనిదా...ఆ...

కావులే కావులే... కల్లలే కావులే
కాపురం నీదెలే కాగడ వెలుగుల్లో..
నా కళ్ళ లోతుల్లో.. కథే వుంది కన్నుల్లో...

కావులే కావులే... కల్లలే కావులే
కాపురం నీదెలే కాగడ వెలుగుల్లో..
నా కళ్ళ లోతుల్లో... కథే వుంది కన్నుల్లో..
కథే వుంది కన్నుల్లో..

2 comments:

మణిరత్నం గారి మూవీస్ లో(ఇద్దరు, విలన్)..యెందుకో ఐశ్వర్యరాయ్ అంత అందం గా ఉండరని నాకనిపిస్తుంటుంది..

ఆ క్యారెక్టర్స్ వలన అలా అనిపిస్తుండి ఉండచ్చు శాంతి గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.