శనివారం, జులై 21, 2018

ఆమని ఋతువు వచ్చినదే...

జోథా అక్బర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జోధా అక్బర్ (2006)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్  
సాహిత్యం : రాజశ్రీ 
గానం : శ్రీనివాస్

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట


వేదనలే రగిలేనె క్రోధనలే మిగిలేనె
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామె
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే
చేరువనున్న చేరదురా ఆవేదన ఇక తీరదులె
చీకటి తెర ఏదో మానడుమా ఉన్నదే

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట


గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి మా పాలిట వికటించినదీ
నేనిచట బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది
కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట 


2 comments:

అటు ధూం ఐనా..ఇటు జొధా అక్బర్ ఐనా..ఐశ్వర్య,హృతిక్ రాక్స్..

ధూం కన్నా నాకు వీళ్ళ జంట ఇందులో ఎక్కువ నచ్చుతారండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.