గురువారం, జులై 19, 2018

ఓ సోనా నీ కొరకే...

మామ్ చిత్రంలోని ఒక చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : మామ్ (2017)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : అనంతశ్రీరామ్
గానం : హేమచంద్ర, ప్రియాంక

నీ దారి పూదారిలా వేచున్నదే చూడవే
దాదా అని ఓ వెన్నెలా పిలిచిందే నిజంగా వెళ్ళవే
ఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే ఫలిస్తోంది రోజూ ఓ కలా

రారా ముందుకీ అంటుందీ క్షణం
దూరాన్నోడిద్దాం ఈ రోజే మనం
ఇవ్వాళీ గుండెల్లో ఆశ ఇది ఈనాటిదే
రేపె రెప్పల్లో అందాల వనం

ఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా
నీ కోసమే నీ కోసమే
ఓ సోనా నీ కొరకే ఫలిస్తోంది రోజూ ఓ కలా
నీ కోసమే నీ కోసమే

కంటి చెమ్మనీ అంటనివ్వమే
కొంటె నవ్వునీ వాడనివ్వమే
ఏమేమి చేస్తున్నా ఏవో తప్పవే
సాగే జీవితం ఎంత చిత్రమే

ఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే ఫలిస్తోంది రోజూ ఓ కలా
నీ కోసమే నీ కోసమే
 

4 comments:

మనసుని కదిలించే సినిమా..మంచి పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

హృద్యంగా తీసారు సినిమా...
Nice song...

అవును రాజ్యలక్ష్మి గారు.. థాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.