ఆదివారం, జులై 22, 2018

ఒక దివ్య గానమే ప్రేమంటే...

డర్టీ పిక్చర్ చిత్రంలోని ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డర్టీ పిక్చర్ (2011)
సంగీతం : విశాల్ శేఖర్
సాహిత్యం :
గానం :

ఒక దివ్య గానమే ప్రేమంటే
ఎదలోని రాగమే ప్రేమంటే
మకరంద సారమే ప్రేమంటే
సుమ గంధమేలే అదీ

సెలయేటి నాదమే ప్రేమంటే
హరివిల్లు అందమే ప్రేమంటే
విడిపోని బంధమే ప్రేమంటే
నయనాన వెలుగే అదీ

ప్రియ నువ్వే జీవన జ్యోతివిలే
నా మదిలో పదిలము అయ్యావే
మురిపించవే మరిపించవే పలికేనే రాగ వీణా
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే

ఒక దివ్య గానమే ప్రేమంటే
ఎదలోని రాగమే ప్రేమంటే
మకరంద సారమే ప్రేమంటే
సుమ గంధమేలే అదీ

ఉదయమైన నీ ఊహలే సంజె వేళ నీ ఊహలే
ఓఓ నువ్వే చెలి నా గమ్యమే రేపవలు నీ ధ్యాసలే
నీవులేని వెన్నెల రేయి చీకటులు కమ్మేస్తాయి
రావేల రంగుల చిలక నా ప్రేమ మొలక

నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే

జంటగానూ నడిచీ నడిచీ సొమ్మసిల్లి పోయానే
అదేబాటలోనే చేరవే మాటామంతి తోనే
నేటి రేయి సాగనున్నదే ఇదే రాతిరీ చేరవే
ఇక మనదే ఈ జగమే నీవెక్కడో నేనక్కడే
మన పెదవులే తడబడెనులే ఇక దూరమెందుకంటా

నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే 
 

2 comments:

ఈ ట్యూన్ మాకు చాలా చాలా ఇష్టమండీ..

బావుంటుందండీ.. హిందీలో కూడా సూపర్ హిట్ ఐందనుకుంటాను ఈ పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.