శనివారం, జులై 07, 2018

ఆటల పాటల నవ్వుల...

అమ్మాయంటేనే అపురూపం పుట్టినింట తండ్రికి ఎంత గారాలపట్టో మెట్టినింట భర్తకు అంతటి అనురాగాల పట్టి. అలాంటి ఓ అపురూపమైన నేస్తం పుట్టినరోజు ఈ రోజు. తనకి శుభాకాంక్షలు అందజేస్తూ ఆకాశమంత చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : ఆకాశమంత (2009)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : మధు బాలకృష్ణన్

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా!
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా!
మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగ చూపిస్తా!
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయి నందిస్తా!
 
మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగ చూపిస్తా!
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయి నందిస్తా!
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా!
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా!

అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే
మాధురమౌ భావాలేవో మోగే లోలోనా
పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే
ఉరకలే పదులై వేలై పొంగే నాలోనా!
లాలిపాటే నేనై, లాల పోసేవాణ్ణై
నాన్ననై నింపనా లేత హృదయానా!

మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగ చూపిస్తా!
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయి నందిస్తా!

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా!
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా!

ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం!
అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు
అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం!
క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనానా!

మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగ చూపిస్తా!
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయి నందిస్తా!

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా!
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా!

మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగ చూపిస్తా!
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయి నందిస్తా!

2 comments:

మా శుభాకాంక్షలు కూడా అందజేయండి..

తప్పకుండా తెలియజేస్తాను శాంతి గారు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.