ఎమ్మెస్ ధోనీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ధోనీ (2016)
సంగీతం : అమాల్ మల్లిక్
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : పలక్ ముఛ్చల్
గురుతొస్తావు నువ్విపుడూ
గుస గుస ఊపిరి తీస్తుంటే
నీ ఎద వీధిలో ప్రతి రోజు
నే సరదాగ నడుస్తుంటే
తూఫాను గాలై వెళుతుంటా
నే ధూళి కణమై వీస్తుంటే
నిన్నెవరింక ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే
నా చూపిలా సాగుతూ
నీ చెంత ఆగిందిలే
చెప్పేందుకేముందిక
చెప్పేశాక శూన్యమే
నా చూపులేనాడూ
నీ కోసమే చూడు
కంటి కబుర్లే చెరేనె
నే చదివాను మౌనంగా
నీ కన్నుల్లో భావాలు
నిన్నెవరింక ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే
నాతో నువ్వే ఉండగా
స్వప్నాలన్నీ తడబడే
చేజారె ఈ క్షణములే
ఆ గాలిలో తేలెలే
నా నవ్వు నీ వల్లే
నా జీవం నీ వల్లే
కంటి కబుర్లె చేరేనే
ఎపుడైనా నిను చూడనిదే
పిచ్చే పట్టీ తిరిగేను
నిన్నెవరింక ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే
4 comments:
చక్కని pic..
చక్కని భావం...
థాంక్స్ రాజ్యలక్ష్మి గారు..
మనసుని తాకే పాట..
అవునండీ నాక్కూడా విన్నవెంటనే నచ్చేసిన పాట ఇది.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.