ఆదివారం, జులై 15, 2018

గారాల పట్టి...

ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇంగ్లీష్ వింగ్లీష్ (2012) 
సంగీతం : అమిత్ త్రివేది  
సాహిత్యం : కృష్ణ చైతన్య   
గానం : చందన్ బాల, లావణ్య పద్మనాభన్
స్నేహ సురేష్, విజయ్ ప్రకాష్    

గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే..

గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే..

ఈ పెళ్ళి పిల్ల సిగ్గంత చూడాలి లే
అడుగులోన అడుగేసుకెళ్తుంది లే
కాటుక కళ్ళు మెరిశాయి మెరిశాయి లే
ఇకపై తన ఒళ్ళో ఒదిగుండి పోతుంది లే

ఓ చీరంచులోనే తారలెన్నో
అన్ని మెరిశాయి మెరిశాయి
గాజుల్ల తిరిగే ఋతువులే
పచ్చ పచ్చాని కాంతుల్ని తెచ్చాయి

గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే..

బంగారు బొమ్మ ఇస్తున్నా మీకు
కాస్త జాగ్రత్త జాగ్రత్త
బంగారు తల్లిరా బంగారు తల్లిరా
అంతా రా రండి ఆనందించండీ
తెగ చిందేసి చిందేసి చిందేటి
ఆనందం అందరిదీ ఆనందం అందరిదీ

మీ కళ్ళే చేసే సైగల్లో
ఏదో గమ్మత్తుగా మత్తు దాగుందే
కలలే ఎన్నెన్నో హరివిల్లై
అన్ని రంగుల్నీ తానే మరి చూపింది 
 
ఈ పెళ్ళి పిల్ల సిగ్గంత చూడాలి చూడాలి లే
అడుగులోన అడుగేసుకెళ్తుంది లే
కాటుక కళ్ళు మెరిశాయి మెరిశాయి లే
ఇకపై తన ఒళ్ళో ఒదిగుండి పోతుంది లే

గారాల పట్టి సక్కంది సక్కంది లే
అందాల చిట్టీ బుజ్జాయి బుజ్జాయి లే
సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలి లే
ఆ సామి నిన్ను చల్లంగ చూస్తాడు లే..


2 comments:

యెవ్వర్ బ్యూటిఫుల్ శ్రీదేవి..వుయ్ ఆల్ మిస్ హెర్..

హ్మ్.. అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.