లక్ష్మీభూపాల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లక్ష్మీభూపాల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, ఏప్రిల్ 23, 2021

కుహూ కుహూ అని...

సీత చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు.


చిత్రం : సీత (2019)
సంగీతం : అనూప్ రూబెన్స్ 
సాహిత్యం : లక్ష్మీ భూపాల్
గానం : అర్మాన్ మాలిక్

ఒఓ.. ఒఓ.. ఒఓ.. ఒఓ..
ఒఓ ఒఓ ఒఓ ఒఓ
కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా
హో.. కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా

ఆ నవ్వులే సిరిమల్లెలై
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకీ ఆరాటమే
చేరాలనీ జడ కుచ్చుల్లలో
ఓ ఇంధ్రధనుసే వర్ణాల వానై
కురిసెను జల జల
చిటపట చినుకులుగా

కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మా
బదులుగ నవ్వొకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి
ఓఓ..ఒఓ..ఓఓ..ఒఓ..
ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి
సెలయేరు పైన జలతారు వీణ
పలికెను గలగల సరిగమపదనిసలా

కూకూకూ..
కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా

నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ
నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా
దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఓఓ..ఒఓ..ఓఓ..ఒఓ..హో..
నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ
నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా
దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఏ కష్టమైనా ఉంటాను తోడై
తడబడు అడుగున
జతపడి నేనున్నా

కూ..కూ..కూఊఊ...
కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా 


బుధవారం, డిసెంబర్ 05, 2018

క్యాకరూఁ.. మై క్యాకరూఁ...

47 డేస్ చిత్రం కోసం రఘుకుంచె స్వరపరచిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. లక్ష్మీ భూపాల్ గారి సాహిత్యం, నీహా కడివేటి గాత్రం చాలా చక్కగా కుదిరాయి ఈ పాటకి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 47Days (2018)
సంగీతం : రఘు కుంచె 
సాహిత్యం : లక్ష్మీభూపాల   
గానం : నీహ కడివెటి
   
క్యాకరూఁ.. మై క్యాకరూఁ
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే
ఓ మాహివే.. మాహివే..  
ఓ మాహివే.. మాహివే..  
క్యాకరూఁ.. ఎంత గడుసోడే
క్యాకరూఁ.. సొంతమయ్యాడే

మనసు నాకైనా చెప్పకుండానే
ఎప్పుడో తనతో వెళ్ళిందా
వయసు రాగానే ఎదురుగా తానే
ఎన్నడో ముడిపడిపోయిందా
ఓయ్ నేస్తమా నా ప్రాణమా
నా తోడుగా ఉంటావనే
వున్నానులే నీ కోసం
చిరుగాలి పరదాల్లో
అలసిన కలువగ
చెలియను ఐతే

క్యాకరూఁ.. ఓ మాహివే
మై క్యాకరూఁ.. ఎంత గడుసోడే

పచ్చబొట్టల్లే మారిపోయాడే
వెచ్చగా నాలో కలిశాడే
కాలి మెట్టల్లే చుట్టుకున్నాడే
జంటగా నాతో నడిచాడే
ఓ అమ్మలా ఈ జన్మలా
కలిశావులే కల కాదుగా
విడిపోనులే చితినైనా
మనసంతా నువ్వైతే
నేనని నువ్వని వేరౌతానా

క్యాకరూఁ..మై క్యాకరూఁ..
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే 


సోమవారం, అక్టోబర్ 31, 2016

చిరునవ్వులే చిరుగాలులై...

కళ్యాణవైభోగమే చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కళ్యాణవైభోగమే (2015)
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సాహిత్యం : లక్ష్మీ భూపాల్
గానం : హరిచరణ్, సుష్మా త్రియ

చల్తే చల్తే జానేదో యారో నిన్నటి కథ 
హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద 
ఛోటీసీ జిందగి సోచ్ లే.. ఆనందం ఉన్నది దేఖ్ లే.. 
దిల్ గాలి పటంలా ఎగిరే దారుల్లో

చిరునవ్వులే చిరుగాలులై వీయగా 
బాగుందిలే ఈ హాయి మెల మెల్లగా
చిరునవ్వులే చిరుగాలులై వీయగా 
బాగుందిలే ఈ హాయి మెల మెల్లగా

చల్తే చల్తే జానేదో యారో నిన్నటి కథ 
హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద 
ఛోటీసీ జిందగి సోచ్ లే.. ఆనందం ఉన్నది దేఖ్ లే.. 
దిల్ గాలి పటంలా ఎగిరే దారుల్లో

చిరునవ్వులే చిరుగాలులై వీయగా 
బాగుందిలే ఈ హాయి మెల మెల్లగా
ఊహూహూ.. లాలాలల్లలాలాలా 
బాగుందిలే ఈ హాయి మెల మెల్లగా

సం టైమ్స్ ఖుషీలు సం టైమ్స్ కన్నీళ్ళు 
లైఫొక డ్రామా క్వీనూ 
ఏం కొంప మునగదోయ్ లైటు తీసుకో
సో వాట్ అనాలి జానూ 
సెంటీ ఫీలింగ్స్ సిల్లీ కొశ్ఛన్సు
డైలీ చిరాకు గేము
నీ ఫ్రెండ్సు ఉండగా టెన్షనెందుకు 
మీదే విన్నింగు టీము
వన్ బై టూ కప్పు కాఫీ గల్తీలు అన్ని మాఫీ
ఫ్రెండ్షిప్పే పెద్ద ట్రోఫీ క్రేజీ లైఫ్ లో. 

చిరునవ్వులే చిరుగాలులై వీయగా 
బాగుందిలే ఈ హాయి మెల మెల్లగా
తీరానానానాన.. ఆహ్హాహ్హాహాహహా
బాగుందిలే ఈ హాయి మెల మెల్లగా


శుక్రవారం, మార్చి 04, 2016

మనసంతా మేఘమై తేలిపోదా...

ఈ రోజు విడుదలవుతున్న కళ్యాణవైభోగమే చిత్రానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ.. అందులోని ఓ చక్కని మెలోడీ విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఆడియో పూర్తి పాట యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : కళ్యాణవైభోగమే (2016)
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సాహిత్యం : లక్ష్మీ భూపాల్
గానం : చిన్మయి శ్రీపాద

మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా
ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా అందుకేనా...

మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా

ఇంత మోసం ఎవరికోసం
మనసుకే నేను చులకనా
ఎంత దూరం ఈ ప్రయాణం
కోపమా నా పైనా..
నువ్వే లేని నాలోనేను
ఉండలేననా
భారమైన ఊపిరి చూసీ
దాచుకున్న ఇష్టం తెలిసీ
అతని వైపు నన్నే లాగేనా
నిదురపోని కళ్ళను చూసీ
కలలు వచ్చి నిందలు వేసీ
అతని పరిచయాలే అడిగేనా

...తేలిపోదా...
...తాకగా...

వేణుగానం వెదురులోనే
దాగి ఉందన్న సంగతి
పెదవిపైనా అతని పేరే
పలికితే తెలిసింది
ఉయ్యాలూగె నా ఊహల్లో
ఊపిరైనది
బుగ్గమీద చిటికేస్తాడు
సిగ్గులోన ఎరుపవుతాడూ
ఎందుకింత సొంతం అయ్యాడే
రెప్పచాటు స్వప్నం వాడూ
కమ్ముకున్న మైకం వాడూ
ఏవిటింత పిచ్చై పోయానే

తనచూపే... తాకగా...
ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా అందుకేనా...
మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా
 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.